పార్టీ విజయం కోసంకృషిచేయాలి
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:10 AM
ww
పలాసరూరల్, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): అభివృద్ధే ధ్యేయంగా, రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వెంకన్నచౌదరి పిలుపునిచ్చారు. శనివారం పలాస టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని పార్టీ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులతో క్షేత్రస్థాయి సమస్యలు, రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చించారు. మండలాల్లో సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దృష్టిసారించాలని కోరారు. రానున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఎన్నికల దృష్ట్యా క్షేత్రస్థాయిలో సవాళ్లను తెలుసుకొని కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరికట్ల విఠల్, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, పార్లమెంటరీ ఉపాధ్యక్షులు గాలి కృష్ణారావు, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, మందస, వజ్రపుకొత్తూరు, మండల అధ్యక్షులు భావన దుర్యోధన, సూరాడ మోహన్, టీడీపీ నాయకులు ఎం.నరేంద్ర, టి.రవిశంకరగుప్తా, సవర రాంబాబు,కె.సత్యం పాల్గొన్నారు.