Share News

కొండపేట లిఫ్ట్‌కు మరమ్మతులు చేయాలి

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:11 AM

మంత్రి అచ్చెన్నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీమేరకు కొండపేట లిఫ్ట్‌కు మరమ్మతులు చేసి సాగునీరందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు కోరారు. శని వారం కొండపేట లిప్టు జలసాధన కమిటీ సభ్యులతో కలిసి ర్యాలీ నిర్వహిం చారు.

కొండపేట లిఫ్ట్‌కు మరమ్మతులు చేయాలి
ర్యాలీ నిర్వహిస్తున్న రైతులు, సీఐటీయూ నాయకులు :

కోటబొమ్మాళి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మంత్రి అచ్చెన్నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీమేరకు కొండపేట లిఫ్ట్‌కు మరమ్మతులు చేసి సాగునీరందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు కోరారు. శని వారం కొండపేట లిప్టు జలసాధన కమిటీ సభ్యులతో కలిసి ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండపేట లిప్పు పరిధిలో నీలంపేట, మాసాహెబ్‌పేట, పట్టుపురం, తాటిపర్తి, తలియతిరి, లింగాల పాడు, దరివాడ, విశ్వనాధపురం పంచాయతీల్లో 22 గ్రామాల పరిధిలో 2500 ఎకరాలకు సాగు నీరందడం లేదని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి హనుమంతు ఈశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బగాతి వాను, కొండపేట లిఫ్టు జలసాధన కమిటి నాయకులు రెడ్డి లక్ష్మణ రావు, సనపల నారాయణరావు, గుంట అప్పన్న, రొక్కం తులసిరావు, బాణాల మురళీకృష్ణ, సనపల ఖజాన, దుప్పల సిమ్మయ్య, గుంట కసవయ్య, అప్ప లరాజు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2026 | 12:11 AM