Share News

సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:03 AM

శ్రీముఖలింగంలో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాలని జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌ కుమార్‌ తెలిపారు.

సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలి
అధికారులతో సమీక్షిస్తున్న అసిస్టెంట్‌ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌కుమార్‌

  • అసిస్టెంట్‌ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌ కుమార్‌

  • శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఏర్పాట్లు పరిశీలన

జలుమూరు, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగంలో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాలని జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌ కుమార్‌ తెలిపారు. శ్రీముఖలింగం మహాశివరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లతో పాటు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో భక్తులకు సేవలందించాలన్నారు. ఉత్సవాల్లో అనుకోని ఘటనలు జరిగితే భక్తులను ఎలా రక్షించాలనేదానిపై దృష్టిసారించి పనిచేయాలన్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక అధికారులు అలెర్టుగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా పోలీసులు, వైద్యశాఖ, అగ్నిమాపక శాఖ నిర్వహించిన మాక్‌డ్రిల్‌ ను పరిశీలించారు. ఆర్డీవో కె.సాయిప్రత్యూష, తహసీల్దార్‌ జె.రామారావు, ఎంపీడీవో బి.చిన్నమ్మడు, ఆర్‌ఐ జగదీష్‌, ఈవో ఏడుకొండలు, డిప్యూటీ డీఎంహెచ్‌వో టి.శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 12:03 AM