‘విద్యార్థుల బస్సు’కు తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:04 AM
శ్రీకాకుళం నుంచి హిరమం డలం వెళుతున్న ఆర్టీసీ విద్యార్థుల బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది.
సరుబుజ్జిలి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నుంచి హిరమం డలం వెళుతున్న ఆర్టీసీ విద్యార్థుల బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం సాయంత్రం విద్యార్థులతో బస్సు సరుబుజ్జిలి జంక్షన్‌కు చేరే స మయంలో ఈ ప్రమాదం చోటు చేసు కుంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగం గా ముందుకు వెళుతున్న లారీ ఒక సారి గుంతలో ఇరుక్కొని ఆగిపోవడం తో వెనుక నుంచి వచ్చిన బస్సు లారీ ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న విద్యార్థులలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఆర్టీసీ బస్సు ముందు భాగంలోని ఓ అద్దం పగిలిపోయింది. లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడంతో ప్ర మాదానికి గురైన ఆర్టీసీ బస్సును డ్రైవర్ రోడ్డుపైనే నిలిపివేశాడు. దీంతో కొంత సేపు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అంద లేదని సరుబుజ్జిలి పోలీసులు తెలిపారు.