మొబైల్ య్యాప్ ద్వారా ఇంటి పన్ను వసూళ్లు
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:12 AM
మొబైల్ య్యాప్ ద్వారా ఇంటిపన్ను వసూళ్లు చేస్తు న్నామని, రశీదు ఇవ్వడానికి రెం డురోజులు పడుతుందని, ఎవరైతే ఇంటి పన్ను చెల్లిస్తారో వారి మొ బైల్‌కు టెక్ట్ మెసేజ్ వస్తుందని ఎంపీడీవో ఫణీంద్రకుమార్ తెలి పారు.
కోటబొమ్మాళి, ఫిబ్రవరి 14( ఆంధ్రజ్యోతి): మొబైల్ య్యాప్ ద్వారా ఇంటిపన్ను వసూళ్లు చేస్తు న్నామని, రశీదు ఇవ్వడానికి రెం డురోజులు పడుతుందని, ఎవరైతే ఇంటి పన్ను చెల్లిస్తారో వారి మొ బైల్‌కు టెక్ట్ మెసేజ్ వస్తుందని ఎంపీడీవో ఫణీంద్రకుమార్ తెలి పారు. శనివారం స్థానిక మండల పరిషత్ సమావేశం మందిరంలో ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్ ఆధ్వ ర్యంలో జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో సభ్యులు గ్రామాల్లో ప్రజ లు కార్యదర్శులకు చెల్లిస్తున్న ఇంటిపన్నుకు రశీదు ఇవ్వడంలో ఎందుకు అలస్యం చేస్తున్నారని అధికారులను సభ్యులు ప్రశ్నించారు. పన్ను చెల్లించిన వారికి మెసేజ్ కూడా రావడంలేదని సభ్యులు వివరించగా.. ఎంపీడీవో స్పం దించి కార్యదర్శులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. తర్లిపేట కొండపై విశ్వవిద్యాలయం, వేదపాఠశాల, వెంకటేశ్వరాలయం కోసం 2016లో అప్పటి ప్రభుత్వం చిన్నజీయర్ స్వామికి 210ఎకరాలు గల తర్లికొండను అప్పగించిందని, ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని, ఆ స్థలం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి తీర్మానించాలని జీయన్నపేట ఎంపీటీసీ నంబాళ రాజశేఖర్ కోరారు. ఎంపీపీ రోణంకి ఉమా స్పందించి దీనిపై అధికారులు విచారణ జరిపి పనులు నిర్వహించకపోతే తీర్మానిస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు బోయిన నాగేశ్వరరావు, దుక్క రోజారామకృష్ణ, ఏవో నారాయణరావు, ఏపీవోలు జి.హరిప్రసాద్, సూర్యనారాయణ, ఆర్‌అండ్‌బీ జేఈ హరనాధరావు పాల్గొన్నారు.