ప్రభుత్వపాఠశాలల్లో చదివించండి
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:08 AM
మండలంలోని మాకివలస, రెడ్డికపేట, బసివలస తదితర గ్రామాల్లో ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు.ఈ మేరకు శనివారం ప్రభుత్వ పాఠశాలల ఆవశ్యకత, అందుబాటులో ఉన్న పథకాలు, సౌకర్యాలు వివరిస్తూ పలుగ్రామాల్లో ఉపాధ్యాయులు అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు.
నరసన్నపేట, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని మాకివలస, రెడ్డికపేట, బసివలస తదితర గ్రామాల్లో ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు.ఈ మేరకు శనివారం ప్రభుత్వ పాఠశాలల ఆవశ్యకత, అందుబాటులో ఉన్న పథకాలు, సౌకర్యాలు వివరిస్తూ పలుగ్రామాల్లో ఉపాధ్యాయులు అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వం యూనిఫాం, బూట్లు, ఎండీఎం తదితర సదుపాయాలను కల్పించడంతోపాటు ఒత్తిడిలేని చదువులు చెబుతూ మానసిక వికాసం పెంపుదించనున్నట్లు వివరించారు. గ్రామాల్లో ఎంఈవో ఆదేశాల మేరకు ఇంటింటా అడ్మిషన్ల డ్రైవ్ చేపడుతున్నట్లు హెచ్‌ఎంలు బాబురావు, జ్యోతి తదితరులు తెలిపారు.
తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి
పాతపట్నం ఫిబ్రవరి14(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ప్రగతిసాధనలో విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని హెచ్‌ఎం ఎస్.వైకుంటరావు కోరారు. శనివారం పాతపట్నంలోని ప్రభుత్వోన్నతపాఠశాలలో నోబ్యాగ్‌డేను, గృహసంపర్క్ కార్యక్రమాలను నిర్వహించారు.గృహసంపర్క్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళ్లి తల్లి దండ్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం బ్యాగ్‌డే ఆవశ్యకతను వివరించారు. విద్యార్థుల ఏయే సబ్జెక్ట్‌ల్లో వెను కబడి ఉండడం, ఆరోగ్యస్థితి గతులపై తల్లిదండ్రులకు వివరించారు.