అందాల పోటీల్లో మెరిసిన మేఘన
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:08 AM
: హైదరాబాద్ వేదికగా ఐఎల్‌ఏహెచ్‌ఈ మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మిస్ గ్రాండ్-ఆంధ్రప్రదేశ్ పోటీలలో శ్రీకాకుళం నగరానికి చెందిన చింతలపూడి మేఘన సెకెండ్ రన్నరప్‌గా నిలిచింది
అరసవల్లి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ వేదికగా ఐఎల్‌ఏహెచ్‌ఈ మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మిస్ గ్రాండ్-ఆంధ్రప్రదేశ్ పోటీలలో శ్రీకాకుళం నగరానికి చెందిన చింతలపూడి మేఘన సెకెండ్ రన్నరప్‌గా నిలిచింది. రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు యువతులు పాల్గొన్న ఈ పోటీలలో శ్రీకాకుళం యువతి సత్తా చాటడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. చిన్నప్పటి నుంచి మేఘనకు మోడలింగ్‌పై గల ఆసక్తిని గమనించిన ఆమె తల్లిదండ్రులు చింతలపూడి వెంకటరావు, శోభారాణిలు కుమార్తెను ఆ దిశగా ప్రోత్సహించారు. మేఘన ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు మామోస్ పేరుతో శ్రీకాకుళంలో ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు.