Share News

నకిలీ మందుల విక్రయాలను నిషేధించాలి

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:13 AM

రాష్ట్రంలో ప్రజల ఆరో గ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్న నాణ్యతలేని, నకిలీ మందుల అమ్మ కాలను నిషేధించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకట రమణ డిమాండ్‌ చేశా రు.

 నకిలీ మందుల విక్రయాలను నిషేధించాలి
ధర్నా నిర్వహిస్తున్న సీపీఐ నాయకులు

అరసవల్లి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజల ఆరో గ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్న నాణ్యతలేని, నకిలీ మందుల అమ్మ కాలను నిషేధించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకట రమణ డిమాండ్‌ చేశా రు. రాష్ట్ర సమితి పిలుపు మేరకు శనివారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మందుల కంపెనీలు లాభార్జన, కార్పొరేట్‌ ఆసుపత్రుల వ్యాపార ధోరణి, పరీక్షల పేరుతో మెడికల్‌ ల్యాబొరేటరీల దందా లతో ప్రజలను దోచుకుం టున్నారని విమర్శించారు. డ్రగ్స్‌ కంట్రోల్‌ వ్యవస్థను బలోపేతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కొన్న శ్రీనివాస్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుప తిరావు, సీపీఐ నాయకులు సీహెచ్‌ గోవింద రావు, పాపయ్య, భాస్కరరావు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2026 | 12:13 AM