రైల్వేస్టేషన్లతో పాటు సిబ్బంది గృహసముదాయాల వద్ద పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యాలపై రైల్వేశాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు ఎన్డీఏ కూటమి శ్రేణులు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మార్గమధ్యలో డ్రైవర్‌కి ఫిట్స్ రావడంతో వారంతా ఆందోళన చెందారు.
Passing-out parade of 142 constables పోలీసులంటే ప్రజలో భయం కాదు.. బాధ్యత అనే భావన కలిగించాలని రాష్ట్ర వ్యవసాయ, మత్స్య, సహకారశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాజ్యాంగానికి విధేయులుగా ఉంటూ, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. నిజాయితీ, నిష్పక్షపాతంతో సేవలు అందించాలని నూతన కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు.
SMC elections at srikakulam ప్రభుత్వ పాఠశాలల్లో యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. మంగళవారం జిల్లాలోని 2,593 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు.
Reservoir works progressing briskly ఆఫ్‌షోర్ పనులపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి పనులు పూర్తిచేసి.. రైతులకు సాగునీరు అందించేలా చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జోరుగా పనులు సాగుతున్నాయి.
Encroachment of Basavanna Bandha నరసన్నపేట బజారువీధిలోని బసవన్న చెరువుపై అక్రమార్కుల కన్ను పడింది. గత రెండు రోజులుగా అక్రమార్కులు ఈ చెరువు స్థలంలో యంత్రాలతో మట్టి వేసి చదునుచేస్తూ.. ఆక్రమణకు పాల్పడుతున్నారు.
ఏళ్ల తరబడి కోర్టు కేసులకు మధ్యవర్తిత్వం ద్వారా సులభంగా పరిష్కారం లభిస్తుం దని జిల్లా న్యాయ సేవాధికార సం స్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను జిల్లా వ్యవసాయశాఖాధికారుల బృందం మంగళవారం పరిశీలించింది.
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్మలపై ఐక్యపోరాటాలు చేపడతామని ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా అధ్యక్షుడు ఎం. సాజీ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కరించాలని స్కూల్ బచావో ఉద్యమాన్ని బలోపేతం చేస్తామన్నారు.