Share News

నేడు మహాశివరాత్రి

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:18 AM

మహాశివరాత్రి వేడుకలకు జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. శివుని దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. క్యూలైన్లు..బారికేడ్లతో పాటు మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ముఖ్యమైన క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది.

నేడు మహాశివరాత్రి
అరసవల్లి: ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో క్యూలైన్లు

శివాలయాల్లో పూజలకు ఏర్పాట్లు

మహాశివరాత్రి వేడుకలకు జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. శివుని దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. క్యూలైన్లు..బారికేడ్లతో పాటు మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ముఖ్యమైన క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది.

శ్రీముఖలింగంలో..

జలుమూరు, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి ఉత్సవాలకు శ్రీముఖలింగేశ్వరాలయాన్ని ముస్తాబు చేశారు. ఆదివారం నుంచి ఈ నెల 18 వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశా రు. ప్రత్యేక దర్శనానికి, ఉచిత దర్శనానికి వేర్వేరు బారికేడ్లు ఏర్పాటు చేశారు. గతంలో ప్రత్యేక దర్శనానికి ఆలయం దక్షిణ వైపు నుంచి... ఉచిత దర్శనానికి ఉత్తర దిశ నుంచి బారికేడ్లు ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం క్యూలైన్లు దక్షిణ వైపు నుంచి ఏర్పాటు చేసి బోర్డులు అమర్చారు. భక్తులకు ఎండ తగలకుండా షామియానాలు, తివాచీలు ఏర్పాటు చేశా రు. ఆలయ సముదాయాన్ని పూలతో అలంకరించారు. అర్థ రాత్రి నుంచే స్వామిదర్శనం కల్పిస్తున్నట్లు ఈవో ఏడుకొండలు తెలిపారు. నాలుగు రోజులపాటు వైద్యసేవలందించను న్నట్టు డిప్యూడీ డీఎంహెచ్‌వో తాడేల శ్రీకాంత్‌ తెలిపారు.

600 మంది పోలీసులతో బందోబస్తు

మహాశివరాత్రి పర్వదినాన శ్రీముఖలింగేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జలుమూరు ఎస్‌.ఐ. బి.అశోక్‌బాబు తెలిపారు. 73 సీసీ కెమోరాలతో నిఘా ఉంచామన్నారు. 10 డ్రోన్‌ కెమె రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. బుధవారం వంశధార నదిలో చక్రతీర్థ స్నానాలకు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వివరించారు. 24 రోప్‌ పార్టీలను నియమించినట్టు వివరించారు. ప్రత్యేక దర్శనానికి రూ.20 టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఆలయం వెనుక భాగంలో మూడు ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

భక్తుల భద్రతే ముఖ్యం

జలుమూరు, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): భక్తుల భద్రతే ధ్యేయంగా ఏర్పాట్లు ఉండాలని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయి ప్రత్యూష అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను నరసన్నపేట నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చనతో కలసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్య భక్తులకు స్వామి దర్శనం కలిగేలా ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. క్యూలైన్లలో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఉచిత ప్రసాదం కూడా భక్తులకు అందించాలన్నారు. భక్తులు బయటకు వెళ్లే మార్గాన్ని సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వీఐపీల దర్శనానికి ప్రత్యేక లైను ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఈ పరిశీలనలో తహసీల్దారు జె.రామారావు, ఆర్‌.ఐ. జగదీష్‌, ఆలయ ఈవో ఏడుకొండలు, ఆలయ పాలక మండలి చైర్మన్‌ శివప్రసాద్‌ పాడి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు తర్ర బలరాం, సర్పంచ్‌ టి.సతీష్‌కుమార్‌, అర్చకులు పాల్గొన్నారు.

శ్రీకాకుళంలో...

అరసవల్లి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మహాశివ రాత్రి ఉత్సవాలకు శ్రీకాకుళం నగరంలోని శివాల యాలు పూర్తిస్థాయిలో ముస్తాబయ్యాయి. స్థానిక పాతబ్రిడ్జి సమీపంలో గల పురాతనమైన ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయంలో ఈవో సుకన్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని పూలతో ప్రత్యేకం గా అలంకరించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లను, తాగునీరు వంటి వసతులను కల్పిస్తున్నారు. చే శారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. పోలీ సులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నక్క వీధిలో గల ఉమాజఠలేశ్వర స్వామి ఆలయాన్ని విద్యుద్దీ పాలతో సుందరంగా అలంకరించారు. తెల్లవారుఝామునే భక్తులు నాగావళి నదిలో పవిత్ర స్నానాలు ఆచ రించి, ఉమారుద్ర కోటేశ్వరుని దర్శించుకుంటారు. కానీ ఈ ఏడాది నాగావళి నదిలో నీరు పూర్తిగా లేకపోవడం తో భక్తులు నిరాశకు గురవుతున్నారు.

Updated Date - Feb 15 , 2026 | 12:18 AM