సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:15 AM
ప్రజా సమ స్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్రామాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని విజయ నగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
రణస్థలం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమ స్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్రామాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని విజయ నగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శనివారం సంచాం గ్రామంలో ప్రజాదర్బార్ నిర్వహించి వినతులు స్వీకరిం చారు. అనంతరం అక్కడి నుంచే సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు లంక శ్యామలరావు, పిసిని జగన్నాఽథం నాయుడు, కొమరాపు రవి పాల్గొన్నారు.