Share News

రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలో ప్రతిభ

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:13 AM

కర్నూలులో ఈనెల 13 నుంచి 15 వరకు జరి గిన రాష్ట్రస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో కొర్ని గ్రామానికి చెందిన చమళ్ల రాజశేఖర్‌ 59 కిలోల విభాగంలో బంగారు పతకం సాధిం చాడు.

రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలో ప్రతిభ
బంగారు పతకాన్ని అందుకుంటున్న చమళ్ల రాజశేఖర్‌

బంగారుపతకం పొందిన రాజశేఖర్‌

గార, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): కర్నూలులో ఈనెల 13 నుంచి 15 వరకు జరి గిన రాష్ట్రస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో కొర్ని గ్రామానికి చెందిన చమళ్ల రాజశేఖర్‌ 59 కిలోల విభాగంలో బంగారు పతకం సాధిం చాడు. ఈ మేరకు ఆదివారం అసోసియేషన్‌ కార్యదర్శి రేష్మ బంగా రుపతకం అందించి అభినం దించారు. గతంలోనూ రాజశేఖర్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పలు బంగారు పతకాలు సాధించాడు. రాష్ట్రస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన రాజశేఖర్‌ను కుటుంబ సభ్యులు, గ్రామ స్థులు అభినందించారు.

Updated Date - Feb 16 , 2026 | 12:13 AM