Share News

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పేరిట మోసం

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:20 AM

ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పి స్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ. 15.25 లక్షలు వసూలు చేసి.. నకిలీ నియామక పత్రా లతో మోసగించిన ఘటన శ్రీకాకుళం నగరంలో వెలుగుచూసింది.

 సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పేరిట మోసం

ఇద్దరి నుంచి రూ.15.25 లక్షలు వసూలు

పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

ఇద్దరిపై కేసు నమోదు

శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పి స్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ. 15.25 లక్షలు వసూలు చేసి.. నకిలీ నియామక పత్రా లతో మోసగించిన ఘటన శ్రీకాకుళం నగరంలో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి.. నగరంలోని బొందిలీపురం ప్రాంతానికి చెందిన ముగడ విజయలక్ష్మి డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. శ్రీకాకుళానికి చెందిన తన స్నేహితుడు కుమార్‌ ద్వారా సత్య సాయి జిల్లాకు చెందిన గోపాల్‌ రెడ్డి, నాగేంద్ర రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ‘ఈవై’లో తమకు తెలిసిన వారున్నారని, రూ. 3 లక్షలు ఇస్తే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇప్పిస్తామని వారు విజయ లక్ష్మిని నమ్మించారు. వారి మాయమాటలు నమ్మిన విజయలక్ష్మి.. ఉద్యోగం వస్తుందన్న ఆశతో విడ తల వారీగా ఫోన్‌ పే ద్వారా వారికి రూ.2.70 లక్షలు ముట్టజెప్పారు. అంతటితో ఆగని కేటు గాళ్లు.. విజయలక్ష్మి ద్వారా విశాఖపట్టణానికి చెందిన అనిల్‌ అనే వ్యక్తికి కూడా వల వేశారు. అతనికి కూడా ఈవై కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి ఏకంగా రూ. 12.55 లక్షలు దండుకున్నారు. ఇలా ఇద్దరి నుంచి మొత్తం రూ. 15.25 లక్షలు వసూలు చేశారు.

నకిలీ పత్రాలతో నిర్ధారణ..

డబ్బులు చేతికి అందాక నిందితులు బాధి తులకు నకిలీ నియామక పత్రాలను పంపిం చారు. ఆయా పత్రాలపై అనుమానం వచ్చి ఆరా తీయగా అవి నకిలీవని తేలింది. దీంతో బాధితులు నిలదీసేందుకు ఫోన్‌ చేయగా.. గోపాల్‌ రెడ్డి, నాగేంద్ర రెడ్డి ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం మానేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితురాలు విజయలక్ష్మి శ్రీకాకుళం టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్‌ సీఐ ఈశ్వరరావు తెలిపారు. అపరిచితుల మాటలు నమ్మి ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ చేయవద్దని, ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ ఈశ్వరరావు హెచ్చరించారు.

Updated Date - Feb 15 , 2026 | 12:20 AM