సంజీవయ్య జీవితం ఆదర్శప్రాయం
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:16 AM
పిన్న వయసులోనే ముఖ్య మంత్రిగా వ్యవహరించి నిజాయితీగా వ్యవహరించిన వ్యక్తి దామోదం సంజీవయ్య అని, ఆయన జీవితం ఆదర్శప్రా యమని డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు అన్నారు.
అరసవల్లి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): పిన్న వయసులోనే ముఖ్య మంత్రిగా వ్యవహరించి నిజాయితీగా వ్యవహరించిన వ్యక్తి దామోదం సంజీవయ్య అని, ఆయన జీవితం ఆదర్శప్రా యమని డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు అన్నారు. నగరంలోని సంజీవయ్య పార్కులో ఆయన వర్ధంతి నిర్వహించారు. సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిం చారు. ఈ సందర్భంగా అన్నాజీరావు మాట్లాడుతూ.. భూసంస్కర ణలు ప్రవేశపెట్టి దార్శనికుడిగా గుర్తింపుపొందారని కొనియాడారు. అనంతరం జిల్లా దళిత నాయకుడు కూరాకుల వెంకట్రా వును సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మంత్రి నర్సింహమూర్తి, కేవీఎల్‌ఎస్ ఈశ్వరి, బి.గోవింద్, బొత్స వెంకట రమణ, కె.సింహాద్రినాయుడు తదితరులు పాల్గొన్నారు.
సంస్కరణలకు నిలువుటద్దం ‘దామోదరం’
కలెక్టరేట్, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నిరాడంబర జీవితం, సామాజిక సంస్క రణ లకు నిలువుటద్దం అని జిల్లా సాంఘిక సంక్షేమశాఖాఽధి కారి కె.వినాయకం అన్నారు. సంజీవయ్య వర్ధంతిని శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. సంజీవయ్య చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 38 ఏళ్ల వయసులో ముఖ్య మంత్రిగా, రెండు సార్లు ఏఐసీసీ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా పనిచేసి నిష్కళంక, నిజాయితీ గల నాయ కుడిగా కీర్తిపొందారన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు దాసరి తిరుమల రావు, దళిత సంఘాల నేతలు బోనెల అప్పారావు, తోట రాము, దండా శి రాంబాబు, అర్జి కోటి, సిబ్బంది పాల్గొన్నారు.