ఒంగోలు నగరపాలక సంస్థ 150 ఏళ్ల పండుగకు సిద్ధమైంది. ఒంగోలు మునిసిపాలిటీగా ఏర్పడి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్దిన్నర ఉత్సవాలను నభూతో నభవిష్యతి అన్నట్లు యంత్రాంగం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఒంగోలుకు చెందిన కొన్ని ప్రత్యేకతలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం.
పార్టీ నాయకుడు హఠాన్మరణం నేపథ్యంలో అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన జగన్ పర్యటనను శవ రాజకీయం చేసేందుకు ఆ పార్టీలోని కొందరు నాయకులు విశ్వప్రయత్నం చేశారు. మరోవైపు జగన్‌ను చూసేందుకు వచ్చిన ఆ పార్టీ శ్రేణులలో కొందరు చిందులు తొక్కుతూ తొడలు కొడుతూ సవాళ్లు విసురుతూ మేమింతే మారమంతే అన్న తరహాలో ప్రవర్తించారు.
గ్రామీణ ప్రాంతాలకు తీపికబురు. ముఖ్యంగా రోడ్లకు మహర్దశ పట్టింది. పల్లెపండుగ 3.0 కింద భారీగా పనులు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ విడత గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించను న్నారు.
ఒంగోలు ఉత్సవానికి నగరం సిద్ధమవుతోంది. ఈనెల 30న శతాబ్దిన్నర వేడుక జరగనుండగా వారంరోజుల నుంచి నగరంలో అలంకరణ, కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
కూటమి పాలనే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని జల వనరులశాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. చీమకుర్తి-కారుమంచి మేజర్ కెనాల్ జలహారతి కార్యక్రమంలో సోమవారం మంత్రి పాల్గొన్నారు.
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ పాఠశాలల్లో మంగళ వారం పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తిచే శారు. జిల్లాలోని 1,434 ప్రభుత్వ, 46 ఎయిడెడ్ కలిపి 1,480 పాఠశాలల్లో ఎన్నికలు జరుగుతాయి.
రానున్న సీజన్లో పరిమితికి లోబడే పొగాకు పంట సాగు చేయాలని బోర్డు చైర్మన్ యశ్వంత్‌కుమార్ రైతులకు సూచించారు. సోమవారం ఒంగోలు వచ్చిన ఆయన తొలుత స్థానిక కర్నూలు రోడ్డులోని ఒంగోలు-1ను, అనంతరం టంగుటూరు వేలం కేంద్రాన్ని సందర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఒంగోలుకు వస్తు న్నారు. ఉదయం 11.40 గంటలకు స్థానిక ఏబీఎం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో ఆయన దిగుతారు.
ప్రజా ప్రభుత్వానికి అభివృద్ధి బాట అని.. వైసీపీది అరాచకపు బాట అని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చెప్పారు.
ఒంగోలు మునిసిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం నగరంలో హెరిటేజ్ వాక్ నిర్వహించగా ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఉదయం 7 గంటలకే వివిధ వర్గాలకు చెందిన వందలాది మంది నగరంలోని మంగమూరు రోడ్డు బైపాస్ జంక్షన్‌కు తరలివచ్చారు. 8 గంటలకల్లా విద్యార్థులు, యువకులు, మహిళలు, టీడీపీ శ్రేణులతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది.