Share News

యథేచ్ఛగా కల్తీపాల తయారీ

ABN , Publish Date - Feb 10 , 2026 | 02:47 AM

దర్శి ప్రాంతంలో కల్తీపాల తయారీ జోరుగా సాగుతోంది. దీన్ని అడ్డుకో వడంలో ఆహార భద్రతాశాఖ అధికారులు విఫలమవు తున్నారు. మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతున్నారు. సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం, పనిభారం పెరగటంతో పూర్తిస్థాయులో దృష్టి సారించలేకపోతున్నామని వారు చెబుతున్నారు.

యథేచ్ఛగా కల్తీపాల తయారీ
దర్శిలో పాల శ్యాంపిల్స్‌ తీస్తున్న ఆహార భద్రత అధికారులు (ఫైల్‌)

నియంత్రణలో ఆహార భద్రత అధికారులు విఫలం

మొక్కుబడి తనిఖీలతో మమ!

పాలు కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు

దర్శి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): దర్శి ప్రాంతంలో కల్తీపాల తయారీ జోరుగా సాగుతోంది. దీన్ని అడ్డుకో వడంలో ఆహార భద్రతాశాఖ అధికారులు విఫలమవు తున్నారు. మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతున్నారు. సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం, పనిభారం పెరగటంతో పూర్తిస్థాయులో దృష్టి సారించలేకపోతున్నామని వారు చెబుతున్నారు. ఆశాఖ పూర్తిస్థాయిలో తనిఖీలు చేయకపోవడంతో కల్తీపాల తయారీ కేంద్రాలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. అక్రమార్కులతో లింకులు పెట్టుకున్న కొన్ని పాలశీతల కేంద్రాలు తక్కువ ధరకు కొని సొమ్ము చేసుకుంటు న్నాయి. ఆ పాలను వాడుతున్న ప్రజలు మాత్రం రోగాల బారిన పడుతున్నారు. చిన్నారులకు పాలు తాపాలంటే భయపడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దర్శిప్రాంతంలో కల్తీపాలు విచ్చలవిడిగా తయారుచేసి సొమ్ము చేసుకు న్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహ రించడంతో అక్రమార్కులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడూ దాడులు నిర్వహిస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోతోంది. దాడులు నిర్వహించిన కొద్దిరోజులు అక్రమార్కులు మౌనంగా ఉండి, ఆతర్వాత యథాతథంగా కొనసాగిస్తున్నారు. దుర్వాసన వెదజల్లుతుండటంతో వాటిని కొనాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఆహార భద్రతాశాఖ అధికారులు కల్తీపాల తయారీని పూర్తిగా అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

దాడులు ఉధృతం చేస్తాం

కల్తీపాల నియంత్రణకు దాడులు ఉధృతం చేస్తామని ఆహార భద్రత శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల కొన్నిచోట్ల పాల శ్యాంపిల్స్‌ తీసి పరీక్షలకు పంపించామని, రిపోర్టులు రాగానే కల్తీపాలు అని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దర్శి-కురిచేడు రోడ్లులోని ఒక పాలశీతల కేంద్రంలో శ్యాంపిల్స్‌ సేకరించి పంపగా కల్తీ జరిగినట్లు పరీక్షల్లో తేలడంతో రూ.50 వేలు జరిమానా విధించినట్లు చెప్పారు. పాలశీతల కేంద్రాలకు యథేచ్ఛగా కల్తీపాలు సరఫరా అవుతున్న విషయం ఈ సంఘటన ద్వారా స్పష్టమవుతుంది.

Updated Date - Feb 10 , 2026 | 02:47 AM