Share News

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:29 PM

కార్పొరేట్‌గా దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నట్టు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. మంగళవారం మండలంలోని కొణిదెన గ్రామంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు 237 సైకిళ్లను అందజేశారు

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన
సైకిళ్లు పంపిణీ చేస్తున్న మంత్రి రవికుమార్‌

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

కొణిదెనలో 237 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ

బల్లికురవ, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి) : కార్పొరేట్‌గా దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నట్టు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. మంగళవారం మండలంలోని కొణిదెన గ్రామంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు 237 సైకిళ్లను అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పాఠశాలల్లో కూడా రాజకీయాలు నడిచాయన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ప్రత్యేక దృష్టితో పాఠశాలలను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులకు అందించే కిట్‌లపై కూడా రాజకీయ నేతల ఫొటోలు, గుర్తులు లేకుండా పారదర్శకంగా అందజేస్తున్నామన్నారు. నియెజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించి పలుసంస్థల ద్వారా విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను అందజేస్తున్నట్టు మంత్రి రవికుమార్‌ చెప్పారు. ఇప్పటికే ఏడువేల మందికి సైకిళ్లను ఇచ్చామన్నారు. ఈఏడాది నుంచి పదో తరగతి విద్యార్థులు నూరు శాతం ఫలితాలు సాధించేలా నెల రోజుల పాటు డిగ్రేడ్‌ విద్యార్థులకు హాస్టల్‌ను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అనంతరం కొణిదెన గ్రామంలో మంత్రి రవికుమార్‌ గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించారు. పలుగ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై అర్జీలను అందజేశారు. నక్కబొక్కలపాడు గ్రామానికి చెందిన నీటి సంఘం అధ్యక్షుడు దర్శి రామస్వామి, మరికొందరు తమ గ్రామంలోనే అయిదో తరగతి వరకు పాఠశాల నిర్వహించాలన్నారు. బల్లికురవ గ్రామానికి విద్యార్థులు వెళ్లాలంటే రోడ్డుపై గ్రానైట్‌ లారీల నుంచి ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రవినాయక్‌, ఎంపీడీవో కుసుమకుమారి, ఎంఈవో శ్రీనివాసరావు, హెచ్‌ఎం కేబీ వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు దూళిపాళ్ల హనుమంతరావు, గ్రామ నేతలు చెరుకూరి అంజనేయులు, గుంజి సుబ్బారావు, తన్నీరు నాగేశ్వరరావు, కుంచపు అంజనేయులు, యిన్నమూరి ఉమ, రామయ్య, శైల్‌ కంపెనీ ప్రతినిధులు కామేశ్వరరావు, రాజిరెడ్డి, అసిస్టు సంస్థల డెరెక్టర్‌ జాష్టి కిన్ను పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 11:29 PM