Share News

‘మెనూ సక్రమంగా అమలు చేయడంలేదు సార్‌’

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:34 PM

‘మెను సక్రమంగా అమలు చేయడం లేదు, చాలీచాలని భోజనం పెడుతున్నారు.. మా వార్డెన్‌తో మాట్లాడం సార్‌’ అంటూ ఉలవపాడు ఎస్సీ బాలుర వసతి గృ హం విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు విన్నవించుకున్నారు.

‘మెనూ సక్రమంగా అమలు చేయడంలేదు సార్‌’
వార్డెన్‌ కుమారిని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన ఎస్సీ హాస్టల్‌ బాలురు

ఉలవపాడు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) :‘మెను సక్రమంగా అమలు చేయడం లేదు, చాలీచాలని భోజనం పెడుతున్నారు.. మా వార్డెన్‌తో మాట్లాడం సార్‌’ అంటూ ఉలవపాడు ఎస్సీ బాలుర వసతి గృ హం విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు విన్నవించుకున్నారు. మంగళవారం సీఐఎ్‌సఎఫ్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యేకు వసతిగృహం విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దగ్గరుండి ఆయనను హస్టల్‌కు తీసుకెళ్లి వారి దుస్థితిని ఎమ్మెల్యేకు చెప్పుకున్నారు. సాయంత్రం వేళ ఇచ్చే స్నాక్స్‌ సక్రమంగా ఇవ్వడం లేదని రాగి లడ్డూల పరిమాణం తక్కువగా ఉన్నాయని ఎమ్మెల్యేకు వివరించారు. అదేవిధంగా మెనూ సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. సరిపడినంత అన్నం పెట్టడం లేదని, తాగేందుకు మంచి నీళ్లు కలుషితంగా ఉన్నాయిని, స్నానానికి నీళ్లు మురికి నీళ్లు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. అక్కడే ఉన్న వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గతంలో కూడా పిల్లలు ఇలాంటి ఫిర్యాదు చేశారని, తీరు మార్చుకోకపోతే శాఖపరమైన చర్యలకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుందన్నారు. ఇకపై నుంచి పిల్లల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఎమ్మెల్యే ఇంటూరి వసతి గృహం అఽధికారికి సూచించారు. దీంతో పిల్లలు ఎమ్మెల్యే చూపించిన చొరవకు సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 10 , 2026 | 11:34 PM