పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో అవినీతికి పాల్పడిన వారి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఇప్పటికే పీడీ శ్రీహరి ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో విచారణ ప్రారంభమైంది. ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన వరుస కథనాలకు కలెక్టర్ కూడా స్పందించారు. విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు.
విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యా యుడికి తల్లిదండ్రులు తగిన బుద్ధిచెప్పిన ఘటన మండలంలోని బి.నిడమానూరు గ్రామంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న హైస్కూల్ ప్లస్ మహిళా కళాశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా బుధవారం వివిధ వర్గాల వారు ఘనంగా నిర్వహించారు. ఒకవైపు ప్రభుత్వపరంగా యంత్రాంగం, మరోవైపు దళిత, ప్రజాసంఘాలు, ఇతర సంస్థల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. అంబేడ్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అమరావతిలో జరిగిన రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీలో గిద్దలూరుకు చెందిన ఎన్.రమ్యశ్రీ హోంమంత్రి పాత్ర పోషించింది. తనదైన శైలిలో అదరగొట్టింది. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రమ్యశ్రీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో పాల్గొంది.
అప్పుల బాధతో పొలంలోనే పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన త్రిపురాంతకం మండలం గొల్లపల్లిలో చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన ఓబులరెడ్డి రమణయ్య (50) తనకున్న నాలుగెకరాల పొలంలో కొన్నేళ్లుగా మిర్చి సాగు చేస్తున్నారు.
రైతన్నలకు ప్రజా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పెద్ద నాగులవరం గ్రామంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మార్కాపురం జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాటను తీర్చారని టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మార్కాపురం జిల్లాకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో బుధవారం సీఎంకు కృతజ్ఞతగా టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి ఎరిక్షన్‌బాబు, టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు.
ఓ మత్స్యకార యువకుడు మంగళవారం అర్ధరాత్రి అనుమానాస్పదరీతిలో దుర్మరణం చెందాడు. అందిన వివరాల ప్రకారం... చీరాల మండల పరిధిలోని దానాయిపేటకు చెందిన ఓసిపిల్లి మోషే(26) మత్స్యకారుడు. ఇటీవలే ఇతనికి ఓ యువతితో నిశ్చితార్థం కూడా జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా అగ్రహారం, ఈనామ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మొదటి విడతలో అన్నదాత సుఖీభవ నిధులు జమకాలేదు. ఈ కారణంగా అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు, బల్లికురవ మండలాలలోని అగ్రహారం, ఇనామ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులు నిరుత్సాహానికి గురయ్యారు.
వాడరేడు - పిడుగురాళ్ల జాతీయ రహదారి(167ఏ)కి ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించి కాలువలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సంసిద్ధమయ్యారు. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో కాలువలు పొంగిపోయి పర్చూరు ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తింది. దీంతో ఆయా గ్రామాలతోపాటు పంట పొలాలు సైతం ముంపునకు గురయ్యాయి. వరద పోటెత్తడంతో భారీ నష్టం కలిగింది.