సీఎం చంద్రబాబుకి రుణపడి ఉంటాం
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:26 AM
ఇచ్చిన హామీని అమలు చేసినందుకు సీఎం చంద్రబాబుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని 108 సిబ్బంది ముక్తకంఠంతో చెప్పారు.
ఎన్నికల హామీ అమలు చేసినందుకు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసిన 108 సిబ్బంది
పొదిలి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : ఇచ్చిన హామీని అమలు చేసినందుకు సీఎం చంద్రబాబుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని 108 సిబ్బంది ముక్తకంఠంతో చెప్పారు. శుక్రవారమిక్కడ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ 108 సిబ్బంది కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో పాలాభిషేకం చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీమేరకు రూ.5వేల వరకు జీతం పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్లు నిండిని ప్రతి ఒక్కరికీ రూ.5వేలు పెంచినట్లు తెలిపారు. ఈ ఉత్సాహంతో ప్రజలకు మరింత సేవలు అందిస్తామన్నారు.
థ్యాంక్యూ సీఎం సార్
పెద్దదోర్నాల, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి) : మండలంలోని 108 అంబులెన్స్‌లో ఉద్యోగులుగా పనిచేస్తున్న సిబ్బంది థ్యాంక్యూ సీఎం సార్ అంటూ శుక్రవారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిబ్బందిలో ఒకరైన ఈఎంటీ బాష మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది వినతులు ఆలకించి సమస్యలను పరిష్కరించి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటు అందించినందులకు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ సీఎంచంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.