Share News

ఉపాధి పథకం ఎత్తివేతకు కుట్ర

ABN , Publish Date - Feb 14 , 2026 | 02:57 AM

ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్రపన్నుతోందని పీసీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. అందులో భాగంగానే వీబీజీ రాంజీ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఇది పేదలకు శాపంలా మారిందన్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా శుక్రవారం ఆమె మండలంలోని తుమ్మలచెరువుకు వచ్చారు.

ఉపాధి పథకం ఎత్తివేతకు కుట్ర
రచ్చబండలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

గతేడాది 18.50లక్షల జాబ్‌ కార్డుల తొలగింపు

కేంద్రంపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం

పథకం అమలు తీరు, వేతనాల చెల్లింపుపై ఆరా

తుమ్మలచెరువులో రచ్చబండకు హాజరు

తర్లుపాడు, ఫిబ్రవరి 13 (ఆంధ్రజోతి) : ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్రపన్నుతోందని పీసీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. అందులో భాగంగానే వీబీజీ రాంజీ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఇది పేదలకు శాపంలా మారిందన్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా శుక్రవారం ఆమె మండలంలోని తుమ్మలచెరువుకు వచ్చారు. అక్కడ రచ్చబండలో పాల్గొన్నారు. పథకం అమ లు తీరు, వేతనాల చెల్లింపు తదితర విషయాలను కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా షర్మిల మాట్లాడుతూ.. ఉపాధి హామీ కింద కూలీలకు125 పనిదినాలు కల్పించాల్సి ఉందన్నారు. అయితే గతేడాది కేంద్రం కేవలం 52 పనిదినాలను మాత్రమే కల్పించిందన్నారు. 18.50లక్షల జాబ్‌ కార్డులను తొలగించిందన్నారు. సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌ బీజేపీకి తొత్తులుగా మారారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం వంటి రాష్ట్ర ప్రయోజనాలపై ఎంపీలు ఢిల్లీలో గళం ఎత్తడంలేదన్నారు రాహుల్‌ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్‌ సైదా, కార్యదర్శి మహబూబ్‌ వలి, పార్టీ మండల అధ్యక్షుడు హుస్సేన్‌, కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 02:57 AM