హోరాహోరీగా ఎడ్ల పోలురాదా పోటీలు
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:45 AM
మహాశివరాత్రి తిరునాళ్లను పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి సీనియర్ విభాగం నాటుబండి పోల్‌రాదా పోటీలు ఉత్సాహంగా సాగాయి.
చినగంజాం, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి) : మండలంలోని సోపిరాల గ్రామంలోని లలితాపరమేశ్వరి సమేత రామకోటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో మహాశివరాత్రి తిరునాళ్లను పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి సీనియర్ విభాగం నాటుబండి పోల్‌రాదా పోటీలు ఉత్సాహంగా సాగాయి. సోపిరాల టైర్లుబండ్ల అసోసియేషన్, గ్రామస్తుల సహకారంతో నిర్వహించిన ఈ పోటీలలో 12 జతల ఎడ్లు పాల్గొన్నాయి. పోటీలను విశ్రాంత మున్సిపల్ కమిషనర్ డాక్టర్ టీఎస్‌ఆర్. ఆంజనేయులు ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పోటీలు నిర్వ హించడం వలన ప్రజల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందుతాయన్నారు. ఈ పోటీలు ఉత్సాహంగా జరగ్గా, పేక్షకుల ఈల లు, కేరింతలతో దేవస్థానం ప్రాంగణం తిరునాళ్ల వాతావరణం నెలకొంది. పోటీలను తిలకించేందుకు పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు అధికసంఖ్యలో హాజరయ్యారు. పోటీలలో విజేతలైన ఎడ్లజతల యజమాను లకు శనివారం బహుమతులు అందజేయను న్నట్లు నిర్వహకులు తెలిపారు. ఎడ్ల యజమా నులను కమిటీ సభ్యులు శాలువాలతో సన్మా నించారు. పోటీలలో కర్లపాలెం మండ లం దమ్మన్నవారిపాలేనికి చెందిన యామిని వెంకటరమణ ఎడ్లజత నిర్ణీత 10 నిమషాలలో 2703 అడుగులు, సోపిరాల గ్రామానికి చెంది న చెరుకూరి వెంకటసాయి రాఘవేంద్ర కు చెందిన ఎడ్లజత 1953.4 అడుగులు, చెరుకు పల్లి గ్రామానికి చెందిన జజ్జర యల్లమంద, వెంకటగోపాలకృష్ణలకు చెందిన ఎడ్లజత 3,289.6 అడుగుల దూరం లాగింది.