Share News

భూ సమస్యలపై గళం

ABN , Publish Date - Feb 14 , 2026 | 03:00 AM

జిల్లాలో భూ సమస్యలు అధికమవుతున్నాయని కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేలు డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం వారు మాట్లాడారు.

భూ సమస్యలపై గళం

అసెంబ్లీలో మాట్లాడిన కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేలు డాక్టర్‌ ఉగ్ర, కందుల

రెవెన్యూ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి

మార్కాపురం/కనిగిరి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో భూ సమస్యలు అధికమవుతున్నాయని కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేలు డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం వారు మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సమయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌.. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు కందుల, ఉగ్ర పాల్గొన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఇప్పటికీ రైతులను వెంటాడుతున్నాయని వారు అన్నారు. వాటి పరిష్కారానికి ప్రస్తుత ప్రజాప్రభుత్వం అధికారులకు వెసులుబాటు కల్పించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు.

భూ అక్రమాల నిగ్గు తేల్చండి

ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే

కనిగిరి ప్రాంతంలో భూ అక్ర మాల నిగ్గు తేల్చాలి. ఇప్పటి వర కూ 175 ఎకరాల అసైన్డ్‌ భూము ల్లో ప్రైవేటు వ్యక్తులు ప్లాట్లు వేసి అమ్ముకొని ప్రజల్ని మోసం చేశారు. ప్రభుత్వ భూములు కూడా అన్యాక్రాంతమయ్యాయి. వీటిపై ప్రజాదర్బార్‌, మీకోసంలో కలెక్టర్‌, ఆర్డీవోకు, వివిధ సందర్భా ల్లో రెవెన్యూ అధికారులకు ఫిర్యా దులు చేసినా ఇప్పటి వరకూ చర్యలు లేవు. దీనిపై ప్రశ్నిస్తే తగినంతమంది అధికారులు, సిబ్బంది లేరని చెప్తున్నారు. ఈదృష్ట్యా ఖాళీ పోస్టులను భర్తీ చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలి. అన్యాక్రాంతమైన ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను స్వాఽధీనం చేసుకోవాలి.

అధికారుల తీరుతో ప్రభుత్వ కృషి వృథా

కందుల నారాయణరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే

ప్రభుత్వం రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా అవన్నీ కొందరు అధికారుల తీరువల్ల వృథా అవుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెవెన్యూ సదస్సుల్లో దాదాపు 23వేల అర్జీలు వస్తే వాటిలో ఒక్క మార్కాపురం నియోజకవర్గం నుంచే 2,962 ఉన్నాయి. తర్లుపాడు మండలం నుంచి 860 అర్జీలు వస్తే వాటన్నింటినీ పరిష్కరించామని నివేదికలు ఇచ్చారు. పోతవరం గ్రామంలో దేవదాయ భూములు ఉంటే పోతలపాడు భూములను దేవదాయ భూములని రికార్డుల్లో చూపారు. ఈ సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ సదస్సులో రైతులు 67 అర్జీలు సమర్పిస్తే ఇవన్నీ చెత్తబుట్టలో వేసి పరిష్కరించామని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల ఒక రైతు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. మార్కాపురం నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రెవెన్యూ అక్రమాలకు 14 మంది వీఆర్వోలు, ఒక తహసీల్దారు సస్పెండ్‌ అయ్యారు. ఇందుకు సంబంధించి భూములు అన్యాక్రాంతమైనట్లు 350 ఫిర్యాదులు వస్తే వాటిని ఇతరులు కింద ఆన్‌లైన్‌లో ఉంచారు. వాటిని కూడా అధికారులు నేటికీ పరిష్కరించ లేదు. జాయింట్‌ ఎల్‌పీఎం సమస్య కూడా అపరిష్కృతంగానే ఉంది. ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ అర్జీల పరిష్కారంలో శ్రద్ధ చూపలేదు. 1,100 వస్తే వంద మాత్రమే పరిష్కరించామని చూపి 1,000 అర్జీలను అలాగే పెండింగ్‌లో ఉంచారు.

Updated Date - Feb 14 , 2026 | 03:00 AM