Share News

ప్రసన్నాంజనేయస్వామి కిరీటానికి 600 గ్రాముల బంగారం

ABN , Publish Date - Feb 14 , 2026 | 02:52 AM

శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి కిరీటం తయారీకి అవసరమైన 600 గ్రాముల బంగారాన్ని దాతలు శుక్రవారం అందజేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన ముప్ప వరపు సుధీర్‌, ప్రత్యూష దంపతులు రూ.1.10 కోట్ల విలువైన ఈ బంగారాన్ని మంగళగిరికి చెందిన స్వర్ణకారుడు కాటూరి సుబ్బారావు సమక్షంలో ఈవో తిమ్మానాయుడు, ధర్మకర్తల మండలి చైర్మన్‌ చుండూరి మురళీ సుధాకరరావుకు అందజేశారు.

ప్రసన్నాంజనేయస్వామి కిరీటానికి 600 గ్రాముల బంగారం
రూ.1.10 కోట్ల విలువైన బంగారాన్ని ఈవో తిమ్మానాయుడు, చైర్మన్‌ మురళీసుధాకరరావుకు అందజేస్తున్న దాతలు ముప్పవరపు సుధీర్‌, ప్రత్యూష దంపతులు

అందజేసిన కొత్తపేట దంపతులు

విలువ రూ.1.10 కోట్లు

అద్దంకి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి కిరీటం తయారీకి అవసరమైన 600 గ్రాముల బంగారాన్ని దాతలు శుక్రవారం అందజేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన ముప్ప వరపు సుధీర్‌, ప్రత్యూష దంపతులు రూ.1.10 కోట్ల విలువైన ఈ బంగారాన్ని మంగళగిరికి చెందిన స్వర్ణకారుడు కాటూరి సుబ్బారావు సమక్షంలో ఈవో తిమ్మానాయుడు, ధర్మకర్తల మండలి చైర్మన్‌ చుండూరి మురళీ సుధాకరరావుకు అందజేశారు. శింగరకొండ దేవాలయంలో గతంలో ఎన్నడూ ఇంత మొత్తంలో బంగారాన్ని ఎవరూ ఇవ్వలేదు. ప్రత్యేక పూజల అనంతరం దాతలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు నూతి ప్రసాద్‌, పద్మజ, సుబ్బారావు, నాగమ్మ, కోటేశ్వరరావు, సిబ్బంది అరుణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 02:52 AM