జిల్లాలో కష్టాల్లో ఉన్న రైతులకు ఊరట లభించడం లేదు. ఖరీఫ్ సీజన్లో వర్షాలు లేక, పంటలు సాగు కాక జిల్లావ్యాప్తంగా కరువు నెలకొంది. 18 మండలాల్లో తీవ్రంగా, 10 మండలాల్లో మధ్యస్థాయిలో కరువు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అది వెలువడి పక్షం దాటినా రైతులకు ఊరట కలిగించే చర్యలు మాత్రం కనిపించడం లేదు.
రాష్ట్రంలో వైద్య సేవ లను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో జిల్లా వైద్యశాఖ చర్యలు చేపట్టింది. ఈ-సంజీవని టెలీమెడిసిన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించారు.
జరుగుమల్లి మండలం నర్సింగోలులో ఈనెల 9న జరిగే సీఎం చంద్రబాబు సభ ఏర్పాట్లను కలెక్టర్ రాజాబాబు, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టీడీపీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి బుధవారం వేర్వేరుగా పరిశీలించారు.
దర్శి పట్టణానికి చెందిన షేక్ ఆయేషా (22) మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై లోతైన దర్యాప్తు చేయాలని ఆమె కుటుంబసభ్యులు పోలీసులను కోరారు.
ఒంగోలు నగర ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పట్టణ ప్రాంతాల్లో తాగునీటి వనరులు పెంచేందుకు చేపట్టిన అమృత్ 2.0 పనులు చురుగ్గా సాగుతున్నాయి.
సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ పోస్టుల భర్తీకి సంబంధించి చేపట్టిన నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. సాధారణ పరిపాలన శాఖ, పాఠశాల విద్య డైరెక్టర్ ఉత్తర్వుల నేపథ్యంలో అర్ధంతరంగా ఆగిపోయింది. ‘
జాతీయ రహదారిలో మేదరమెట్ల ఫ్లైఓవర్పై ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి కారుఢీకొన్న సంఘటలలో నలుగురు గాయపడ్డారు.
తమ్మవరంలో వైసీపీకి చెందిన 25 కుటుంబాలు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి.
వర్షాలు సమృద్ధిగా కురిసి దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మార్కాపురంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మంగళవారం వరుణ జపం, యాగం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సదరం సర్టిఫికెట్లు మంజూరులో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి సారించింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఒంగోలు జీజీహెచ్(రిమ్స్)లో మంజూరు చేసిన సదరం సర్టిఫికెట్ల వివరాలు పంపించాలని జీజీహెచ్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.