ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కసారిగా పెరిగిన పింఛన్‌తో పింఛన్‌దారుల్లో ఆనందాలు రెండింతలు అయ్యాయని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు చెప్పారు.
సంక్షోభంలోనూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానిదేనని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి చెప్పారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని కలెక్టర్ రాజాబాబు చెప్పారు.
ఇద్దరు వ్యక్తులు అత్యాశకు పోయారు. లక్షలకు మూడు లక్షలు సంపాదించవచ్చని భావించి ఏకంగా రూ.8లక్షలు పొగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రైతులను లక్షాధికారులను చే యడమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఆదివారం మండలంలోని మర్రివేముల గ్రామంలో రైతన్నా మీకోసం కార్యక్రమా న్ని నిర్వహించారు. ముందుగా ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కరపత్రాలను పంపిణీ చేశారు.
పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఒంగోలులో చికిత్స పొందుతూ రైతు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక ఆపన్న హస్తమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని 63 మందికి రూ.43,80,714 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
దిత్వా తుఫాన్ ప్రభావంతో కోతకు వచ్చిన పంటలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాఽధికారి ఎస్.శ్రీనివాసరావు రైతు లకు సూచించారు.
టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమి ష్టిగా కృషిచేయాలని రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక కమిషన్ చైర్‌పర్సన్ పొడపాటి తేజస్విని అన్నారు. ఆదివారం మండలంలోని కొర్లమడుగు, చిన్నఉయ్యావా డ గ్రామాల్లో ఆమె పర్యటించారు.
కృష్ణానది వరద జలాల ఆధారంగా జిల్లాలోని పశ్చిమప్రాంత సాగు, తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టుకు గోదావరి నీరు కూడా అందనుంది. దాని ఆయకట్టుతోపాటు ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం వివిధ వనరుల కింద ఉన్న ఆయకట్టు స్థిరీకరణ, లక్షలాది ఎకరాల మెట్ట భూములకు సాగునీటి సౌకర్యం కలగనుంది.