Share News

ఎన్నాళ్లకెన్నాళ్లకు...!

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:08 PM

ఫిల్టర్‌ బెడ్‌ల మరమ్మతులతో పర్చూరు ప్రజలకు కలుషిత నీటి సమస్యను పరిష్కారం లభించనుంది. చాలా కాలం తరువాత తాగునీటి పథకానికి సంబంధించిన ఫిల్టర్‌ బెడ్‌ల మరమ్మతులకు శ్రీకారం చుట్టినట్లయ్యింది. ప్రస్తుతం ఫిల్టర్‌ బెడ్‌లోని ఇసుకను మార్చటంతోపాటు మరమ్మతులు చేస్తున్నారు.

ఎన్నాళ్లకెన్నాళ్లకు...!
పనులను పరిశీలిస్తున్న నిర్వాహకులు

పర్చూరులో ఫిల్టర్‌ బెడ్‌ల మరమ్మతులకు మోక్షం

ప్రజలకు సురక్షిత నీరు సరఫరా చేసేందుకు చర్యలు

పర్చూరు, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : ఫిల్టర్‌ బెడ్‌ల మరమ్మతులతో పర్చూరు ప్రజలకు కలుషిత నీటి సమస్యను పరిష్కారం లభించనుంది. చాలా కాలం తరువాత తాగునీటి పథకానికి సంబంధించిన ఫిల్టర్‌ బెడ్‌ల మరమ్మతులకు శ్రీకారం చుట్టినట్లయ్యింది. ప్రస్తుతం ఫిల్టర్‌ బెడ్‌లోని ఇసుకను మార్చటంతోపాటు మరమ్మతులు చేస్తున్నారు.

పర్చూరులో మొత్తం నాలుగు ఫిల్టర్‌ బెడ్‌లు ఉండగా ఒక దాన్ని రోటరీ ఆధ్వర్యంలో నిర్వహించే పర్చూరు గంగకు వినియోగిస్తున్నారు. మిగిలిన మూడు ఫిల్టర్‌ బెడ్‌లో ఒక దానికి మరమ్మతులు చేస్తున్నారు. ఫిల్టర్‌ బెడ్‌లో ఉన్న ఇసుకను తొలగించి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే కార్యక్రమం పనులు శరవేగంగా సాగుతున్నాయి. మిగిలిన రెండు ఫిల్టర్‌ బెడ్‌లకు కూడా ప్రణాళికాబద్దంగా మరమ్మతులు చేసి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ సతీ్‌షచంద్ర తెలిపారు.

నియోజకవర్గ కేంద్రం కావటం, జనాఽభా సామర్థ్యం పెరిగి పోవటంతో ప్రజలకు సరిపడా నీటిని శుద్ధిచేసి సరఫరా చేసేందుకు అవకాశం లేదు. అదనంగా ఫిల్టర్‌ బెడ్‌లను నిర్మాణం చేస్తేనే పూర్తిస్థాయిలో స్వచ్ఛమైన నీటిని అందించే అవకాశం ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. ఆ దిశగా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. కొన్నేళ్ల నుంచి ఫిల్టర్‌ బెడ్‌లు పనిచేయకపోవటంతో కలుషిత నీటితోనే ప్రజలు కాలం వెల్లబుచ్చాల్సిన పరిస్థితి నెలకొంది. మరమ్మతుల సంగతి దేవుడికి ఎరుక కనీసం ఇసుకను కూడా మార్చిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఫిల్టర్‌ బెడ్‌ల అభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్నున్నారు.

Updated Date - Feb 17 , 2026 | 11:08 PM