Share News

డీఎంహెచ్‌వోగా డాక్టర్‌ మాధవీలత

ABN , Publish Date - Feb 18 , 2026 | 02:12 AM

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ వో)గా డాక్టర్‌ బి.మాధవీలత నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

డీఎంహెచ్‌వోగా డాక్టర్‌ మాధవీలత

వెంకటేశ్వర్లు గుంటూరుకు బదిలీ

ఒంగోలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ వో)గా డాక్టర్‌ బి.మాధవీలత నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్‌ టి.వెంకటేశ్వర్లును గుంటూరు డీఎంహెచ్‌వోగా బదిలీ చేసింది. ఆయన 2024 డిసెంబరు 24న ఇక్కడ డీఎంహెచ్‌వోగా బాఽధ్య తలు స్వీకరించారు. 14 నెలలపాటు జిల్లాలో పనిచేశారు. ఇటీవల జరిగిన ఉద్యోగుల బదిలీలను వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా నిర్వహించి మన్ననలు పొందారు. అయితే వైద్యశాఖ కార్యాలయంలో జరిగే అవినీతి, అక్రమాలను అరికట్టడంలో ఆయన కొంత మెతకవైఖరిని అవలంబించారన్న ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిరంతరం వివాదాస్పదంగా ఉండే వైద్యశాఖను కొంతమేర గాడిలో పెట్టారని ఉద్యోగుల్లో చర్చ ఉంది. ప్రస్తుతం డీఎంహెచ్‌వోగా నియమితులైన డాక్టర్‌ మాధవీలత మంచి అధికారిగా గుర్తింపు పొందారు. ఏ సమస్యనైనా సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తారనే పేరు ఉంది. ప్రస్తుతం ఆమె రిమ్స్‌ ఆర్‌ఎంవోగా పనిచేస్తున్నారు. మాధవీలతను పలువురు కలిసి అభినందించారు.

Updated Date - Feb 18 , 2026 | 02:12 AM