: ప్రస్తుత ర బీ సీజన్ నుంచి మండలంలో నల్లబర్లీ పొగాకు సా గుపై ప్రభుత్వం నిషేధం విధించిందని వ్యవసాయ శాఖ అధికారి షేక్ మహబూబ్ బాషా అన్నారు. మండలంలోని అనుములవీడు, ఒద్దులవాగుపల్లి, మేడంవారిపల్లి గ్రామా ల్లో మంగళవారం ఆయన రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ర్యాలీ ద్వా రా నల్లబర్లీ సాగు నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా గుంటూరు లింగన్నపాలెం గ్రామం జనసంద్రంగా మారింది. ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన ప్రసంగాన్ని వినేందుకు వెేలాదిమంది ప్రజలు, మహిళలు, యువత భారీసంఖ్యలో తరలివచ్చారు.
మెంథా తుఫానులో సమర్థవంతంగా పనిచేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమష్టిగా పనిచేశారని ప్రశంసించారు. మెంథా తుఫాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు చేపట్టామని నొక్కిచెప్పారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి జిల్లాకు వస్తున్నారు. ఈ ఏడాదిలో ఆయన పర్యటన ఇది మూడోసారి కాగా మూడు విడతలు పశ్చిమ ప్రాంతంలోనే పర్యటించడం విశేషం. అందులోనూ సీఎం గతంలో పాల్గొన్న రెండు, మంగళవారం పర్యటన కూడా రాష్ట్రస్థాయి కార్యక్రమాలే.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లాలో పశ్చిమ ప్రాంతం.. ప్రత్యేకించి కనిగిరి నియోజకవర్గ భవిష్యత్తుకు భరోసా లభించింది. గత ఏప్రిల్‌లో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి కనిగిరి నియోజకవర్గంలోనే శ్రీకారం పలికారు. తాజాగా సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన పార్కుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ప్రారంభోత్సవం చేస్తున్నారు. రేపోమాపో ట్రిపుల్ ఐటీ భవనాల నిర్మాణానికి శంకుస్ధాపన జరగబోతోంది.
గుంటి గంగమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవస్థాన అన్నదాన సత్రం పేరిట నిధులు సమకూర్చి భవనాన్ని నిర్మించారు. అయితే ఆలయ కమిటీ తాజా మాజీ చైర్మన్ దాన్ని శ్రీగంగమ్మ అన్నదాన ట్రస్ట్ సత్రంగా మార్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విరాళాలతో నిర్మించిన అన్నదాన సత్రాన్ని తన సొంతమన్నట్లు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం మార్చడం పట్ల దాతలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘మొంథా తుఫాన్‌తో వాటిల్లిన నష్టాన్ని గుర్తించాం. ప్రభుత్వానికి క్షేత్రస్థా యిలోని పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇస్తాం’ అని కేంద్ర బృందం సభ్యులు భరోసా ఇచ్చారు. తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పి.పౌసు మిబసు, మహేష్‌కుమార్, శశాంక్ శేఖర్‌రాయ్, సాయిభగీరథ్‌లతో కూడిన బృందం సోమవారం జిల్లాకు వచ్చింది.
జిల్లాలో డ్వామా పర్యవేక్షణలో జరుగుతున్న వాటర్ షెడ్ పనుల అమలులో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు రెండు అవార్డులు లభించాయి. దేశవ్యాప్తంగా వాటర్‌షెడ్ పనులు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున జరుగుతున్నాయి
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం వెలిగొండ ప్రాజెక్టును మరోసారి సందర్శించనున్నారు. ఈనెల 7న ప్రాజెక్ట్ పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించిన ఆయన పనుల పురోగతిని పరిశీలించేందుకు మళ్లీ వస్తానని చెప్పారు.
నియోజక వర్గంలో సోలార్ యూనిట్ల పరికరాల తయారీ హబ్ కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.