పరిశుభ్రతే లక్ష్యంగా....
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:11 AM
పరిశుభ్రతే లక్ష్యంగా శనివారం జిల్లావ్యాప్తంగా ప్రజలకు అవగాహన సభలు నిర్వహించారు. వారితో ప్రతిజ్ఞలు చేయించారు. స్వచ్ఛాంధ్ర-స్వ ర్ణాంధ్రలో భాగంగా ప్రభుత్వం ప్రతినెలా మూడో శనివారం పరిశుభ్రత అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం విదితమే. ఈనెలలో మూడో శనివారం సంక్రాంతి సెలవులు కావడంతో నాల్గో వారానికి కార్యక్రమాన్ని మార్చారు.
జిల్లావ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర
పలుచోట్ల అవగాహన సభలు, ప్రతిజ్ఞలు
ఈ విడత జీరో గ్యాప్‌పై దృష్టి
మద్దిపాడులో పాల్గొన్న కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే బీఎన్
ఇతరచోట్ల నేతలు, అధికారులు హాజరు
ఒంగోలు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : పరిశుభ్రతే లక్ష్యంగా శనివారం జిల్లావ్యాప్తంగా ప్రజలకు అవగాహన సభలు నిర్వహించారు. వారితో ప్రతిజ్ఞలు చేయించారు. స్వచ్ఛాంధ్ర-స్వ ర్ణాంధ్రలో భాగంగా ప్రభుత్వం ప్రతినెలా మూడో శనివారం పరిశుభ్రత అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం విదితమే. ఈనెలలో మూడో శనివారం సంక్రాంతి సెలవులు కావడంతో నాల్గో వారానికి కార్యక్రమాన్ని మార్చారు. తదనుగుణంగా ఈ శని వారం పరిశుభ్రత జీరో గ్యాప్ (సంపూర్ణ పరిశుభ్రత) అంశాన్ని తీసుకున్నారు. ఇప్పటికే జరుగుతున్న కార్యక్రమాల నిర్వహణలో ఉన్న లోటుపాట్లను గుర్తించి సంపూర్ణ పరిశుభ్రతపై ప్రజలకు, స్థానిక సంస్థల సిబ్బందికి అవగాహన లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా సభలను నిర్వహించారు. ముఖ్యప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మండలకేంద్రమైన మద్దిపాడులో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కార్యక్రమానికి కలెక్టర్ పి.రాజాబాబు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ హాజరయ్యారు. పలువురు ముఖ్యమైన జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు. పరిశుభ్రత ప్రాధాన్యతను వివరిస్తూ సభను నిర్వహించారు. స్వచ్ఛరథాన్ని ప్రారంభించారు. ఒంగోలులోని కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. వలేటివారిపాలెం మండలం పోకూరులో కార్యక్రమానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. దర్శి పట్టణంలో నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య భాగస్వాములయ్యారు.