Share News

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:09 AM

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్నిరకాల వసతులు కల్పించి మెరుగైన విద్యను అందిస్తున్నట్టు రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. శనివారం మండలంలోని కూకట్లపల్లి ఉన్నత పాఠశాలలో గొట్టిపాటి కిషోర్‌ గ్రానైట్‌, అసిస్టు స్వచ్ఛంద సంస్థ ద్వారా 113 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందజేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య
సైకిళ్లు అందజేసి విద్యార్థినులతో మాట్లాడుతున్న మంత్రి రవికుమార్‌

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ

బల్లికురవ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్నిరకాల వసతులు కల్పించి మెరుగైన విద్యను అందిస్తున్నట్టు రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. శనివారం మండలంలోని కూకట్లపల్లి ఉన్నత పాఠశాలలో గొట్టిపాటి కిషోర్‌ గ్రానైట్‌, అసిస్టు స్వచ్ఛంద సంస్థ ద్వారా 113 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందజేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ పాఠశాల విద్యపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఎలాంటి రాజకీయాలు లేకుండా విద్యార్థులందరికీ తల్లికి వందనం ఇస్తున్నామన్నారు. తాను గతంలో కొందరు విద్యార్థులకు పాఠశాలలకు నడిచి రావడం గమనించానని పేర్కొన్నారు. వారి సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో అద్దంకి నియెజకవర్గంలో ఉన్న 11 వేల మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందజేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఆరు వేల మందికి ఇచ్చామన్నారు. మార్చి నాటికి అందరికీ అందిస్తామన్నారు. పలుసంస్థల ద్వారా సైకిళ్లను సమకుర్చుతున్నామన్నారు. ప్రజాపభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా మాటలు చెప్పకుండా మెగా డీఎస్సీతో 16,300 టీచర్‌ పోస్టులను భర్తీ చేసిందన్నారు. ఆరువేల కానిస్టేబుల్‌ పోస్టుల కూడా భర్తీ చేసినట్టు చెప్పారు. ఏటా టీచర్‌ లనియామకాలు చేపడతామన్నారు. సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో లక్ష్మీప్రసన్న, అసిస్ట్‌ సంస్థ డెరెక్టర్‌ కిన్ను, టీడీపీ నాయకులు ఇప్పల అంజిరెడ్డి, చిననాసరరెడ్డి, క్రిష్ణారెడ్డి, వేల్పుల అబ్రహాం, పాలడుగు సుబ్బారావు, ఎంపీడీవో కుసుమకుమారి, ఎంఈవో రమేష్‌, హెచ్‌ఎం జాన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 03:09 AM