Share News

పెరగనున్న భూముల విలువ

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:06 AM

బహిరంగ మార్కెట్‌కు తగ్గకుం డా భూముల విలువ పెంచేం దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాలలో పెంపునకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆ మేరకు ఒంగోలు అర్బన్‌ అఽథారిటీ పరిధిలో ఉన్న భూములు విలువ 10శాతం పెంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

పెరగనున్న భూముల విలువ

ఒంగోలు అర్బన్‌ అథారిటీ పరిధిలో 10శాతం పెంపు

వచ్చేనెల 1 నుంచి అమలు

ఒంగోలు క్రైం, జనవరి 24 (ఆంధ్ర జ్యోతి): బహిరంగ మార్కెట్‌కు తగ్గకుం డా భూముల విలువ పెంచేం దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాలలో పెంపునకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆ మేరకు ఒంగోలు అర్బన్‌ అఽథారిటీ పరిధిలో ఉన్న భూములు విలువ 10శాతం పెంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సాధార ణంగా రెండేళ్లకు ఒకసారి భూముల విలువ పెంచుతారు. గతేడాది ఫిబ్రవ రిలో జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఉన్న భూములకు స్వల్పంగా 5 నుంచి 10శాతం వరకు విలువ పెంచారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ఒంగోలు, అమ్మ నబ్రోలు, అద్దంకి, చీమకుర్తి, దర్శి, కందుకూరు, ఎస్‌ఎన్‌పాడు, సింగరాయకొండ, మార్కపురం, కంభం, కనిగిరి, వైపాలెం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల పరిధిలో భూముల విలువ పెరగనున్నాయి. ఈ మేరకు మండల రెవెన్యూ కార్యాలయాల నుంచి, రియల్టర్ల నుంచి సమాచారం సేకరించి ప్రణాళికలు తయారుచేశారు. పెంచిన భూముల విలువలను సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలోని నోటీసు బోర్డులలో, రిజిస్ట్రేషన్‌ యాప్‌ వెబ్‌సైట్‌లోను ఉంచారు.

అభ్యంతరాలు తెలియజేయాలి: జిల్లా రిజిస్ర్టార్‌

భూముల విలువ వచ్చేనెల నుంచి స్వల్పంగా పెంచేందుకు చర్యలు చేపట్టామని జిల్లా రిజిస్ర్టార్‌ ఏ. బాలాంజనేయులు శనివారం తెలిపారు. ఒంగోలు, అమ్మనబ్రోలు, అద్దంకి, చీమకుర్తి, దర్శి, కందుకూరు, ఎస్‌ఎన్‌పాడు, సింగరాయకొండ, మార్కాపురం, కంభం, కనిగిరి, వైపాలెం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల పరిధిలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూములు విలువ పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వచ్చేనెల 1 నుంచి పెరుగుతాయని చెప్పారు. అందుకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరారు.

Updated Date - Jan 25 , 2026 | 03:06 AM