ఎల్నినో ప్రభావంతో పాటు బియ్యం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుండటంతో వాటి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెండురకాల నాణ్యమైన బియ్యాన్ని రైతు బజార్ల ద్వారా విక్రయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో తదనుగుణంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకున్నారు.
సంతమాగులూరు మండలంలో నాడు ఉపాధి పనులలో సిబ్బంది, అధికారులు కలసికట్టుగా అవినీతికి పాల్పడ్డారు. ప్రస్తుతం వీబీ జీరామ్జీ పనులలో సిబ్బంది, అధికారుల మధ్య భేదాభిప్రాయాలతో కూలీల పొట్టకొట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సంతమాగులూరు మండలంలో అవినీతిని వంట పట్టించుకున్న మండల స్థాయి అధికారి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదే పంథాను కొనసాగించినట్లు విమర్శలు ఉన్నాయి.
ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో ఎన్డీయే కూటమి తరఫున బీసీలకు 34 శాతం సీట్లు కేటాయిస్తామని మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉంది. కీలకమైన వెనుకబడిన తరగతుల (బీసీ) కేటగిరీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చింది. పట్టణ, గ్రామీణ సంస్థలన్నింటిలోనూ సగటున 28.18శాతం పదవులు బీసీలకు దక్కేలా నిర్ణయించింది.
సింగరాయకొండ మండలం పాకల బీచ్లో శనివారం మధ్యాహ్నం జరిగిన పెనుప్రమాదంతో శ్రీరంగాపురం గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. తీరంలో సరదాగా గడిపేందుకు వెళ్లిన వారిలో ఇద్దరు మృతితోపాటు మరో ఇద్దరు గల్లంతయ్యారు.
ఒంగోలులోని ప్రకాశం భవన్ ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 12న తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమానికి అనుమతి లేదని ఎస్పీ వి.హర్షవర్ధన్రాజు స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ర్శి ప్రాంతంలో డబుల్ రిజిస్ట్రేషన్లతో స్థల వివాదాలు జటిలమవుతున్నాయి. కొంతమంది అక్రమార్కులు నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని అడ్డదారులు తొక్కుతున్నారు.
ఒంగోలులో శనివారం నిర్వహించిన కౌశలం ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూ లల నుంచి నిరుద్యోగ యువతీ, యువకులు భారీగా తరలివచ్చారు. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల ద్వారా కౌశలం కార్యక్రమం ద్వారా నమోదు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలను నిర్వహించారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇన్సర్వీసు టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-26) ఆదివారం నుంచి ప్రారంభమవుతోంది. 1,645 మంది ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరవుతున్నట్లు డీఈవో సీవీ రేణుక తెలిపారు.
మార్కాపురం జిల్లా పరిషత్ సీఈవోగా జోసఫ్కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు.