టమోటా ధర నేల చూపులు
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:02 AM
మార్టూరు పచ్చిమిర్చి కూరగాయల మార్కెట్ లో టమోటా ధర బాగా తగ్గింది. హోల్ సేల్ గా 25 కిలోలు టమోటా బాక్స్ రూ.100 నుంచి రూ.150 మధ్య ధర పలుకుతోంది..
మార్టూరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మార్టూరు పచ్చిమిర్చి కూరగాయల మార్కెట్ లో టమోటా ధర బాగా తగ్గింది. హోల్ సేల్ గా 25 కిలోలు టమోటా బాక్స్ రూ.100 నుంచి రూ.150 మధ్య ధర పలుకుతోంది.. అంటే కిలో టమోటా రూ.4 నుంచి రూ.6 వర కు ధర ఉంది. అయినా టమోటాను కొనుగోలు చేయడానికి వచ్చే వారు తక్కువగా ఉన్నారని ఏజెంట్లు తెలిపారు. 10 రోజుల క్రితం కూడా టమోటా బాక్స్ రూ.500లకు పైనే ఉందని, రెండు రోజుల నుంచి మార్కెట్‌లో టమోటా ధర తక్కువగా ఉందని రైతులు అంటున్నారు. ఇక గ్రామాలలో కిలోరూ.10కి మరి కొంతమంది చిల్లర వ్యాపారులు రూ.50కి మూడు కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. మండలంలో రాజుగారి పాలెం, బొబ్బేపల్లి, వలపర్ల, ఇసుకదర్శి, కోలలపూడి, నాగరాజుపల్లి తదితర గ్రామాలు నుంచి మార్కె ట్‌కు టమోటాను తీసుకు వస్తున్నారు. ఇంకా బల్లి కురవ, అద్దంకి మండలాల నుంచి కూడా వస్తున్నాయి. ఇతర పట్టణాలలోని మార్కెట్‌కు చెందిన వ్యాపారులు తక్కువగా రావడంతో, టమోటాలు అమ్ముడుపోక ఏజెంట్ల వద్ద సరుకు నిలిచిపోతోంది. మరో 10 రోజుల వరకు టమోటా పరిస్థితి ఇదేవిధంగా ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. ఇదిలా ఉండగా ధర తగ్గడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు.