Share News

ఉరేసుకుని వ్యక్తి మృతి

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:19 AM

కుటుంబ సమస్యల కారణంతో ఓ వ్యక్తి ఉరేసుకుని మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.

ఉరేసుకుని వ్యక్తి మృతి

- మృతుడు దర్శి వాసి

తాడేపల్లి టౌన్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): కుటుంబ సమస్యల కారణంతో ఓ వ్యక్తి ఉరేసుకుని మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని బోటు యార్డు ప్రాంతంలో బకింగ్‌ హామ్‌ కాలువ ఒడ్డున చెట్టుకు ఉరి వేసుకున్న వ్యక్తిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ ఖాజావలి వివరాలు సేకరించి, మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు దర్శి మండలం పోతవరం గ్రామానికి చెందిన ఆవుల తిరుమల కొండ (45)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్టు తాడేపల్లి ఎస్‌ఐ ఖాజావలి తెలిపారు.

Updated Date - Feb 20 , 2026 | 12:19 AM