Share News

25న వెలిగొండకు సీఎం

ABN , Publish Date - Feb 19 , 2026 | 02:39 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 25న వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు. పెద్దదోర్నాల మండలంలోని కొత్తూరు, గంటవానిపల్లె గ్రామాల వద్ద జరుగుతున్న ఫీడర్‌ కెనాల్‌ ఆధునికీకరణ, టన్నెల్‌ పనులను పరిశీలించనున్నారు.

25న వెలిగొండకు సీఎం
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాజాబాబు, టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, అధికారులు

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ రాజాబాబు

అధికారులతో సమీక్ష

పెద్దదోర్నాల, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 25న వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు. పెద్దదోర్నాల మండలంలోని కొత్తూరు, గంటవానిపల్లె గ్రామాల వద్ద జరుగుతున్న ఫీడర్‌ కెనాల్‌ ఆధునికీకరణ, టన్నెల్‌ పనులను పరిశీలించనున్నారు. ఈమేరకు ఆయన పర్యటన ఖరారైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్‌ రాజాబాబు.. ఇతర అధికారులు, టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబుతో కలిసి బుధవారం పరిశీలించారు. కొత్తూరు, గంటవానిపల్లె గ్రామాలతోపాటు హెలిప్యాడ్‌, సభా ప్రాంగణం, ఫీడర్‌ కెనాల్‌ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత, ఇతరత్రా చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ పులి శ్రీనివాసులు, ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్‌ శివరామిరెడ్డి, ప్రాజెక్టు ఎస్‌ఈ అబూతాలిమ్‌, డీఎస్పీ నాగరాజు, పీఆర్‌ ఏఈ సుబ్బారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు షేక్‌ మాబు, దొడ్డా శేషాద్రి, చంటి పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 02:39 AM