ఏ తల్లి కన్న బిడ్డో తెలియదు.. ఎందుకు అలా వదిలేశారో అర్థంకావడంలేదు.. తల్లి పొత్తిళ్లలో పడుకొని కేరింతలు కొడుతూ పాలు తాగాల్సిన శిశువు ముళ్ల పొదల్లో గాయాలుబారిన పడి గావుకేకలు పెడుతున్నాడు. రోజులు నిండని పసిబిడ్డ పొత్తి గుడ్డలలో చుట్టి ముళ్ల పొదల్లో వదిలివేసివెళ్లారు. ఈ సంఘటన ఒంగోలు నగరంలో వెలుగుచూసింది.
వెలిగొండ జలాలతో కనిగిరి నీటి సమస్యకు శాశ్వతంగా చెక్ పడాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఇరిగేషన్శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లో వృద్ధిరేటులో ప్రకాశం జిల్లా దూసుకెళ్తోంది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మెరుగైన పనితీరుతో ఇతర జిల్లాలను వెనక్కి నెట్టి ర్యాంకుల్లో ముందంజ వేసింది.
చంద్రబాబు అక్రమ అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ‘నిజం గెలిచింది’ పేరుతో కార్యక్రమాలను నిర్వహించింది. 53 రోజుల అక్రమ నిర్బంధాన్ని గుర్తు చేస్తూ 53 కొవ్వొత్తులను వెలిగించాలని అధిష్ఠానం పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలో పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి.
‘ఆరేళ్ల క్రితం పరిహారం చెల్లిస్తామంటే ఇంటి స్థలం అక్కరలేదని చెప్పాం. వన్టైం సెటిల్మెంట్కు అంగీకరించాం. కానీ ఇప్పుడు (2026లో) పరిహారం ఇచ్చి మీకు ఇక ఇంటి పట్టా లేదని, ఆ రోజు మీరు ఒప్పుకున్నదే కదా అని అధికారులు అంటు న్నారు. అలా అయితే మాకు పునరావాసం ఎలా’ అని వెలిగొండ నిర్వాసితులు కొందరు ప్రశ్నిస్తున్నారు.
రెండు రోజులపాటు అమరావతిలోని సచివాల యంలో జరగనున్న కలెక్టర్ల సదస్సులో జిల్లాకు చెందిన పలు కీలక అంశాలపై నివేదికలతో కలెక్టర్ రాజాబాబు పాల్గొంటున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్రస్థాయిలో సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సదస్సును నిర్వహిస్తోంది.
కూటమి ప్రభుత్వం అర్హులైన అందరికీ పింఛన్ అందించేందుకు చర్యలు చేపట్టింది. దరఖాస్తుకు ఈనెల 7 నుంచి అవకాశం కల్పించింది. దీంతో వేలాది మంది స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు పరుగులు పెడుతు న్నారు. అక్కడ బారులు తీరుతున్నారు.
సాగర్ కాలువల్లో నీటి సరఫరాను ఇరిగేషన్ అధికారులు బుధవారం పరిశీలించారు. ‘తాగునీటి సరఫరాలో అన్యాయం’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో బుధవారం ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. ఇన్చార్జి ఎస్ఈ సతీష్, దర్శి, చీమకుర్తి ఈఈలు స్వామి, గురజాల తదితరులు ఒంగోలు బ్రాంచ్ కాలువ హెడ్ వద్ద నీటి సరఫరాను చూశారు.
ఉమ్మడి జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) పనిచేస్తున్న ప్రిన్సి పాళ్లు, సీఆర్టీలు, పీజీటీలు, పీఈటీల బదిలీలకు సంబంధించి తుది సీనియారిటీ జాబితాలు సిద్ధమవుతున్నాయి. ఒకేస్థానంలో ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసిన ప్రిన్సిపాళ్లు ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తిచేసిన సీఆర్టీలు, పీజీటీలు, పీఈటీలు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను చేపట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఆ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు.