Share News

నాలుగు సింహాల స్థూపం ఆవిష్కరణ

ABN , Publish Date - Jan 27 , 2026 | 02:33 AM

ఒంగోలులోని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన నాలుగు సింహాల స్థూపాన్ని కలెక్టర్‌ రాజాబాబు ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో ముందుగా జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్‌ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు.

నాలుగు సింహాల స్థూపం ఆవిష్కరణ
స్థూపాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు కలెక్టరేట్‌లో ఏర్పాటు

ఒంగోలు కలెక్టరేట్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులోని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన నాలుగు సింహాల స్థూపాన్ని కలెక్టర్‌ రాజాబాబు ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో ముందుగా జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్‌ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన నాలుగు సింహాల స్థూపాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేశు, వివిధ శాఖల అధికారులు ఎం. వెంకటేశ్వరరావు, డాక్టర్‌ టి. వెంకటేశ్వర్లు, రేణుక, పద్మశ్రీ, సీపీవో సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 02:33 AM