ప్రజల అభ్యర్థన మేరకు సీసీరోడ్లకు కోటి
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:05 PM
తమ కాలనీలలో రోడ్లు, సైడుకాలువలు నిర్మించాలని ఎస్సీ కాలనీవాసులు ఎమ్యెల్యే బీఎన్ విజయ్‌కుమార్‌ను అభ్యర్థించారు.. ఆయన స్పందించి రెండు ఎస్సీ కాలనీలలో సిమెంట్‌రోడ్లు, సైడుకాలువల నిర్మాణానికి కోటి రూపాయల నిధులు మంజూరు చేయించారు.. పనులు చేపట్టనున్న కాలనీలోని వీధులను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు.
నాగులుప్పలపాడు ఎస్సీ కాలనీలను మోడ్రన్‌కాలనీలుగా తీర్చిదిద్దాలి
ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్
నాగులుప్పలపాడు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : తమ కాలనీలలో రోడ్లు, సైడుకాలువలు నిర్మించాలని ఎస్సీ కాలనీవాసులు ఎమ్యెల్యే బీఎన్ విజయ్‌కుమార్‌ను అభ్యర్థించారు.. ఆయన స్పందించి రెండు ఎస్సీ కాలనీలలో సిమెంట్‌రోడ్లు, సైడుకాలువల నిర్మాణానికి కోటి రూపాయల నిధులు మంజూరు చేయించారు.. పనులు చేపట్టనున్న కాలనీలోని వీధులను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. నాగులుప్పలపాడు గ్రామంలోని రెండు ఎస్సీ కాలనీలలో సరైన రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకం కింద కోటి రూపాయల నిఽధులను మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. నాగులుప్పలపాడులోని రెండు ఎస్సీకాలనీలలో నూరుశాతం రోడ్లు, సైడుకాల్వలు నిర్మించాలని, కాలనీలలో నెలకొన్న విద్యుత్‌సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు చెప్పారు. కాలనీలను మోడ్రన్ పల్లెలుగా తీర్చిదిద్దాలని సూచించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డీఈ కృష్ణమోహన్, విద్యుత్‌శాఖ డీఈ హరిబాబు, ఎంపీడీవో తేళ్ల రవికుమార్, తహసీల్దార్ కె.ప్రవీణ్‌కుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి కాకర్ల లక్ష్మీవరప్రసాద్, పోతినేని శ్రీనివాసరావు, మెట్టు సుబ్బయ్యనాయుడు, గూడూరి ఝాన్సీ, ఉప్పుటూరి హరినాథ్, పీకా భైరాగి, కొంజేటి ధనుష్, పల్లపోతు సాయిచరణ్ పాల్గొన్నారు.