Share News

వ్యక్తులు కాదు.. పార్టీ ముఖ్యం

ABN , Publish Date - Jan 28 , 2026 | 02:24 AM

‘వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. వ్యవస్థ ముఖ్యం. దానిని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ పనిచేయాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గ కమిటీలను నియమించిన టీడీపీ.. ఆ కమిటీ సభ్యులతో మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్క్‌షాపు నిర్వహించింది.

వ్యక్తులు కాదు.. పార్టీ ముఖ్యం
టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఇతర కమిటీ సభ్యులు

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నేతృత్వంలో హాజరైన టీడీపీ బాధ్యులు

ఒంగోలు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ‘వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. వ్యవస్థ ముఖ్యం. దానిని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ పనిచేయాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గ కమిటీలను నియమించిన టీడీపీ.. ఆ కమిటీ సభ్యులతో మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్క్‌షాపు నిర్వహించింది. ఒంగోలు పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు, శాసనసభ్యుడు డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నేతృత్వంలో పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావుతో పాటు 40మంది సభ్యులు హాజరయ్యారు. కమిటీ సభ్యులందరితో తొలుత సంయుక్తంగా, అనంతరం పార్లమెంట్‌ అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యక్షులతో విడివిడిగా వర్క్‌షాపులను నిర్వహించారు. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇతర ముఖ్యనేతలు పార్టీ బాధ్యతల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. పార్టీని పటిష్టంగా నడిపించేందుకు ప్రతి ఒక్క సభ్యుడూ అంకితభావంతో పనిచేయలని సూచించారు. కార్యకర్తలే అధినేతలని దానిని అందరూ గుర్తించి వారిని గౌరవించాలని నాయకులకు సూచించారు.

Updated Date - Jan 28 , 2026 | 02:24 AM