ఐదు రోజుల పనిదినం కావాలి
ABN , Publish Date - Jan 28 , 2026 | 02:23 AM
బ్యాంకు ఉద్యోగులకు పనిభారం తగ్గించేలా ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీ యూ) జిల్లా కన్వీనర్ రాజీవ్ రతన్‌దేవ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు అన్ని శాఖలను మూసివేసి సమ్మె చేపట్టారు.
బ్యాంకు ఉద్యోగ సంఘాల డిమాండ్
జిల్లావ్యాప్తంగా సమ్మె... ఒంగోలులో బైక్ ర్యాలీ
ఒంగోలు కార్పొరేషన్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : బ్యాంకు ఉద్యోగులకు పనిభారం తగ్గించేలా ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీ యూ) జిల్లా కన్వీనర్ రాజీవ్ రతన్‌దేవ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు అన్ని శాఖలను మూసివేసి సమ్మె చేపట్టారు. ఒంగోలులోని మినీస్టేడియం నుంచి నెల్లూరు బస్టాండ్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక యూనియన్‌బ్యాంకు వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజీవ్‌రతన్‌దేవ్ మాట్లాడుతూ కొన్నేళ్లుగా తమ న్యాయమైన డిమాండ్ ఐదు రోజుల పనిదినంకోరుతుండగా ప్రభుత్వం నుంచి ఆమోదం లభించడం లేదన్నారు. ఇండియన్ బ్యాంక్ అసోసి యేషన్, బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య 2023 డిసెంబరులో పనిదినాల ఒప్పందం కుదిరిందన్నారు. దీనిపై కేంద్రప్రభుత్వం ఇంకా ఎలాంటి నోటిషికేషన్ విడుదల చేయకపోవడం దారుణమన్నారు. ఈ జాప్యాన్ని నిరసిస్తూ యూఎఫ్‌బీయూ పోరాడుతుం దని తెలిపారు. ప్రస్తుతం బ్యాంకుకు నెలలో కేవలం రెండు, నాల్గో శనివారం మాత్రమే సెలవులు ఉన్నా యన్నారు. మిగిలిన శనివారాలు కూడా సెలవుగా ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నార న్నారు. ఎల్‌ఐసీ, ఆర్‌బీఐ, అనేక కేంద్రప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే వారానికి 5 రోజులు పని విధానం అమలులో ఉందన్నారు. కేంద్రప్రభుత్వం బ్యాంకు ఉద్యోగులపై పనిభారం తగ్గించేలా ఐదు రోజులు పనిదినం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా 500 బ్యాంకులు మూసివేయడంతో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో ఏఐబీఓసీ ప్రతినిధులు రాజేష్ ఖన్నా, శ్రీనివాస్, కిషోర్‌రెడ్డి, రవి ప్రకాష్, ఎన్‌సీబీఈ సుధాకర్, ఏఐబీఈఏ ఉమాశంకర్, బ్రహ్మనాయుడు, హాసన్ పాల్గొన్నారు.