ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా పింఛన్లు కోరుతూ ఐదు రోజుల్లో 21,766 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 7వతేదీ నుంచి దరఖాస్తుల దాఖలుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర సంఘాలకు భారీ భరోసా కల్పించింది. గనుల లీజు, సీనరేజీలలో 50శాతం రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వడ్డెర్లను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ప్రత్యేకంగా భూకేటాయింపులు చేసింది.
శ్రీశైలం నుంచి వస్తున్న కృష్ణా జలాలతో నల్లమల సాగర్ రిజర్వాయర్ కళకళలాడుతోంది. శుక్రవారం నాటికి 3.24 టీఎంసీల నీరు రిజర్వాయర్‌కు చేరినట్టు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.
పోలీసులమని మాయమాటలు చెప్పి మత్తుమందు ఇచ్చి మెడలోని బంగారు గొలుసును దోచుకెళ్లిన సంఘటన కొమరోలులోని నయారా పెట్రోల్ బంకు సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కొమరోలుమండలంలోని మదవపల్లి క్రాస్‌రోడ్డులోని రాష్ట్ర రహదారిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
ప్రతి గ్రామంలో అంతర్గత వీధులన్నీ సీసీరోడ్లుగా మార్చాలని శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి చెప్పారు. రాచర్లలో రూ.30.80లక్షలతో మంజూరైన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని, సత్యవోలు గ్రామంలో రూ.43.60లక్షలతో మంజూరైన సచివాలయ భవనాన్ని, అనుములపల్లిలో రూ.10లక్షలు, రంగారెడ్డిపల్లెలో రూ.58లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీరోడ్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
సింగరాయకొండ, మండలంలోని మూలగుంటపాడు పంచాయతీ పరిధిలోని శ్రీచైతన్య నవోదయ పాఠశాలలో ఈ ఏడాది ఫిబ్రవరి 14న కనిగిరికి చెందిన ఆరో తరగతి విద్యార్థి షేక్ తౌషిక్(11) పాఠశాల హాస్టలోని బాత్రూంలో అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు.
ఏ తల్లి కన్న బిడ్డో తెలియదు.. ఎందుకు అలా వదిలేశారో అర్థంకావడంలేదు.. తల్లి పొత్తిళ్లలో పడుకొని కేరింతలు కొడుతూ పాలు తాగాల్సిన శిశువు ముళ్ల పొదల్లో గాయాలుబారిన పడి గావుకేకలు పెడుతున్నాడు. రోజులు నిండని పసిబిడ్డ పొత్తి గుడ్డలలో చుట్టి ముళ్ల పొదల్లో వదిలివేసివెళ్లారు. ఈ సంఘటన ఒంగోలు నగరంలో వెలుగుచూసింది.
వెలిగొండ జలాలతో కనిగిరి నీటి సమస్యకు శాశ్వతంగా చెక్ పడాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఇరిగేషన్‌శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధిరేటులో ప్రకాశం జిల్లా దూసుకెళ్తోంది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మెరుగైన పనితీరుతో ఇతర జిల్లాలను వెనక్కి నెట్టి ర్యాంకుల్లో ముందంజ వేసింది.