ఐసీడీఎస్ పీడీ సరెండర్
ABN , Publish Date - Jan 29 , 2026 | 02:33 AM
జిల్లా స్త్రీ,శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.సువర్ణను కలెక్టర్ రాజాబాబు ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
బాలసదన్‌లో బాలిక మృతి చెందడమే కారణం
ఒంగోలు నగరం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లా స్త్రీ,శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.సువర్ణను కలెక్టర్ రాజాబాబు ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలులోని బాలసదన్‌లో కుంచాల మౌనిక అనే బాలిక ఈనెల 24వ తేదీన మృతిచెందింది. అందుకు ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యమే కారణ మంటూ ‘బాలసదన్‌లో దారుణం.. సకాలంలో వైద్యం అందక బాలిక మృతి’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఈనెల 25న కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందిం చిన కలెక్టర్ రాజాబాబు పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. బాలికకు సకాలంలో పరీక్షలు చేయించడంలో, వైద్యం అందించడంతో పీడీ సువర్ణ నిర్లక్ష్యం వహించినట్లు తేలింది. దీంతోపాటు బాలసదన్, శిశుగృహలో ఉంటున్న బాలికలకు, శిశువులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిఽధులను విడుదల చేయగా వాటిని వినియోగించకుండా ఆమె తీవ్ర అలసత్వం ప్రదర్శించారు. దీంతో పీడీ సువర్ణను ఆయన ప్రభుత్వానికి సరెండర్ చేశారు.