మంత్రులను కలిసిన ఎమ్మెల్యే కొండయ్య
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:59 PM
చీరాల నియోజకవర్గ అభివృద్ధికి శరవేగంగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే కొండయ్య చెప్పారు.
చీరాల, జనవరి28 (ఆంధ్రజ్యోతి) : చీరాల నియోజకవర్గ అభివృద్ధికి శరవేగంగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే కొండయ్య చెప్పారు. బుధవారం సచివాలయంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, కొల్లు రవీంద్ర, ఆనం రామనారాయణరెడ్డిలను ఎమ్మెల్యే కలిశారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను వారి దృష్టికి తీసుకెళ్లారు. కుందేరు ప్రక్షాళన, జిందాల్ సంస్థ చెత్త నిర్వహణ తీరుపై చర్చించారు. అంతేకాకుండా చీరాల మండలం తోటవారిపాలెం రాములవారి గుడి ప్రారంభోత్సవానికి మంత్రులను ఆహ్వానించారు.