నేడు జేసీ కల్పనాకుమారి బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Jan 29 , 2026 | 02:35 AM
జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమితులైన కల్పనాకుమారి గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రిలీవ్ అయిన గోపాలకృష్ణ
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమితులైన కల్పనాకుమారి గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తున్న కల్పనాకుమారిని జిల్లాకు జేసీగా నియమించింది. ఇక్కడ పనిచేస్తున్న గోపాలకృష్ణను వైద్యశాఖ డైరెక్టర్‌గా బదిలీ చేసింది. ఈ నేప థ్యంలో ఆయన బుధవారం రాత్రి రిలీవ్ అయ్యారు.