Share News

ఎండమావిగా రైతు బజార్‌

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:58 PM

పర్చూరులో రైతు బజార్‌ ఏర్పాటు ఎండమావిని తలపిస్తోంది. కూరగాయలు సాగుచేసుకునే రైతులకు, కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుందన్న ఆశయంతో ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదని ప్రజలు చెబుతున్నారు.

ఎండమావిగా రైతు బజార్‌
పర్చూరులో పాత కూరగాయల మార్కెట్‌

ప్రతిపాదన సరే.. కార్యరూపం ఎప్పుడు..?

నిరీక్షణ ఫలించేనా?

పర్చూరు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : పర్చూరులో రైతు బజార్‌ ఏర్పాటు ఎండమావిని తలపిస్తోంది. కూరగాయలు సాగుచేసుకునే రైతులకు, కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుందన్న ఆశయంతో ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదని ప్రజలు చెబుతున్నారు. రైతుల ప్రయోజనాలతోపాటు కూరగాయల సాగును ప్రోత్సహించాలన్న సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వ్యవసాయ మర్కెటింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో రైతు బజార్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పర్చూరులోని పాత కూరగాయల మార్కెట్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందుకు సంబంధించి దాదాపు 50 సెంట్ల స్థలంలో రైతు బజార్‌ నిర్మించుకునే విధంగా ఏఎంసీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆర్‌డీవోకి తహసీల్దార్‌ బ్రహ్మయ్య కలసి స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటికైనా ఉన్నతాఽధికారులు స్పందించి ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించి రైతు బజారును పర్చూరులో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆ దిశగా అఽధికారులు ప్రత్యేకమైన చొరవచూపాలని కోరుతున్నారు.

కోట్ల విలువైన స్థలం నిరుపయోగంగా...

గ్రామ నడిబొడ్డున కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం నిరుయోగంగా ఉంది. ఇప్పటికే కొంత భాగం ఆక్రమణకు గురికాగా మరికొంత భాగం ఆక్రమించేందుకు సిద్ధంగా ఉంది. గతంలో ఈ స్థలంలో కూరగాయల వ్యాపారాలు జోరుగా సాగేవి. ప్రస్తుతం ఒకటి రెండు దుకాణాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రైతుబజారు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jan 28 , 2026 | 11:59 PM