భావితరాల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా సాగుదాం
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:54 PM
భావితరాల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా కనిగిరి ప్రాంతాభివృద్ధి కోసం కలిసి సాగుదామని ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు.
ఒంగోలు పార్లమెంట్
టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ఉగ్ర
కనిగిరి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : భావితరాల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా కనిగిరి ప్రాంతాభివృద్ధి కోసం కలిసి సాగుదామని ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌం డ్స్‌లో నియోజకవర్గంలోని పామూరు మండలానికి చెందిన ఇనిమెర్ల గ్రామ సర్పంచ్ సిద్దమూర్తి లక్ష్మీనారాయణరెడ్డి ఆధ్వర్యంలో 350 కుటుంబాలు వైసీపీని వీడి ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరా యి. ఎమ్మెల్యే వారికి టీడీపీ కండువా వే సి పార్టీలోకి ఆహ్వానించి పార్టీని ఉద్దేశిం చి ప్రసంగించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి వైసీపీని వీడి టీడీపీలో చేరడం శుభపరిణామమన్నారు.
పార్టీలో చేరిన ప్రముఖుల్లో కొంతమంది
ఇనిమెర్ల ఉపసర్పంచ్ బొమ్మన శ్రీనివాసులురెడ్డి, పారిశ్రామిక వేత్త దుగ్గిరెడ్డి జీవన్‌రెడ్డి, ఎర్రగుంట్ల తిరుపతయ్య, గోదా గురువారెడ్డి, మాలకొండారెడ్డి, గాజులపల్లి కృష్ణారెడ్డి, పోలి మాధవ తదితరులతోపాటు 8 మంది వార్డు సభ్యులు, ఇనిమెర్ల గ్రామానికి చెందిన 250 మంది మహిళలు టీడీపీలో చేరారు.