కార్పొరేట్‌కు దీటుగా రాష్ట్రంలోని పేద, సామాన్య ప్రజ లకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల భాగస్వామ్యంతో ఒంగోలు జీజీహెచ్‌లో రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను శనివారం ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయ్‌కుమార్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని మూడు పార్టీల నేతలు నిర్ణయించారు. స్థానిక రామనగ ర్లోని టీడీపీ ఒంగోలు పార్లమెంట్ కార్యాలయంలో శనివారం ఒంగోలు పార్లమెంట్ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు వినాయక చవితి పండుగ బొనాంజాను ప్రకటించింది. ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ), రిటైర్డ్ ఉద్యోగులకు కరువు ఉపశమనం (డీఆర్)ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 18,700 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎ.సత్యానంద్ తెలిపారు. 29 బెంచ్‌లను ఏర్పాటు చేసి 18,380 క్రిమినల్, 238 సివిల్, మూడు ప్రీలిటిగేషన్ కేసులను పరిష్కరించామన్నారు.
ప్రభుత్వం ద్వారా వివిధ వర్గాలకు అందుతున్న సేవలు, సంక్షేమ పథకాల అమలు పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం గతం కన్నా తగ్గింది. కొన్ని కీలక శాఖల్లో ఇది గణనీయంగా పడిపోయింది. ఆయా అంశాలపై ప్రజల సంతృప్తిస్థాయి రాష్ట్రంలోని వివిధ జిల్లాల సగటు ప్రకారం పరిశీలిస్తే... ప్రకాశం, మార్కాపురం రెండు జిల్లాలు చివరి స్థానాల్లోకి వెళ్లాయి.
సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. వ్యర్థాలను సైతం ఆదాయ వనరులుగా మార్చేందుకు ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు శ్రీకారం పలికారు. ఇన్నాళ్లూ నిరుపయోగంగా వదిలేసిన చెత్తను ఇకపై సంపదగా మార్చడంపై కలెక్టర్ రాజాబాబు దృష్టి సారించారు.
సాగర్ కాలువల్లో నీటి పరిమాణం పెరిగింది. జిల్లాకు వాటా ప్రకారం నీరు సాధించడంలో ఇరిగేషన్ అధికారులు ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. తాగునీటి అవసరాల కోసం ఈనెల 1వ తేదీన సాగర్ డ్యాం నుంచి జలాలను విడుదల చేసిన విషయం విదితమే.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లు, సీఆర్టీలు, పీజీటీలు, పీఈటీల బదిలీల కౌన్సెలింగ్ శుక్ర వారం స్థానిక కలెక్టరేట్లోని మీకోసం హాలులో జరిగింది. జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి ప్రక్రియను నిర్వహించారు.
ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా పింఛన్లు కోరుతూ ఐదు రోజుల్లో 21,766 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 7వతేదీ నుంచి దరఖాస్తుల దాఖలుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర సంఘాలకు భారీ భరోసా కల్పించింది. గనుల లీజు, సీనరేజీలలో 50శాతం రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వడ్డెర్లను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ప్రత్యేకంగా భూకేటాయింపులు చేసింది.