చిరుద్యోగుల చిరస్మరణీయ విజయం
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:39 AM
ఆ ఇద్దరు చిరుద్యోగులు గ్రూప్-2లో మెరిశారు. నిన్నటి వరకు తాము జవాబుదారిగా ఉండాల్సి అధికారి స్థాయిలోనికే ప్రస్తుతం వీరు చేరనున్నారు.
పర్చూరు, జనవరి 29 (ఆంఽధ్రజ్యోతి) : ఆ ఇద్దరు చిరుద్యోగులు గ్రూప్-2లో మెరిశారు. నిన్నటి వరకు తాము జవాబుదారిగా ఉండాల్సి అధికారి స్థాయిలోనికే ప్రస్తుతం వీరు చేరనున్నారు. పంచాయతీ కార్యదర్శి నుంచి డిప్యూటీ తహసీల్దార్‌గా, రాష్ట్ర సచివాలయ ఉద్యోగిగా వారు కొలువులు సాధించారు.
పర్చూరు ఇందిరాకాలనీకి చెందిన పాలపర్తి చరణ్‌రాజు గ్రూప్-2 పరీక్షలో డిప్యూటీ తహసీ ల్దార్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈయన సంతమాగులూరు మండలం, కామేపల్లి గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నిరుపేద కుటుం బానికి చెందిన చరణ్‌రాజు బీ-ఫార్మసీ పూర్తిచేసుకుని పోటీ పరీక్షకు సిద్ధమై పంచాయితీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. చిరు ఉద్యోగం చేసుకుంటూ పట్టువిడవక ప్రభుత్వం నిర్వహించిన గ్రూపు-2లో విజయం సాధించారు. పే దరికం నుంచి వచ్చి ఉన్నత ఉద్యోగం కోసం పడిన కష్టం ఫలించడంతో ఆ కుంటుంబంలో ఆనందానికి అవదు లు లేకుండా పోయాయి. అదే విధంగా పర్చూరు మండలం తన్నీరువారిపాలెం గ్రామ కార్యదర్శిగా పని చేస్తున్న గడ్డిపాటి పరిక్షిత్ ప్రభుత్వం నిర్వహించిన గ్రూపు - 2 పరీక్షలో ఎంపికై రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగం సాధించారు. ఇరు వురు యువకులు పంచాయితీ కార్యదర్శు లుగా చిరుఉద్యోగం చేసుకుంటూ అధికారి స్థాయికి ఎంపిక కావడంతో పలువురు అభినందించారు. ఇరువురు యువకులు నిరుపేదలు కావటం, ఉన్నత స్ధాయి ఉద్యోగాలకు ఎంపిక కావటంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లువిరిసింది.