పెరగనున్న భూముల విలువ
ABN , Publish Date - Jan 29 , 2026 | 02:42 AM
జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాం తాల్లో స్వల్పంగా భూముల విలువను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. ఈ మేరకు ప్రజల నుంచి అభ్యంతరాలను కోరుతూ ఆయా ప్రాంతా లలోని సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాలలో నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు.
నేటి వరకు అభ్యంతరాల స్వీకరణ
వచ్చే రెండు రోజుల్లో భారీగా రిజిస్ట్రేషన్లు
1వతేదీ నుంచి పెరిగిన ధరలు అమలు
ఒంగోలు క్రైం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాం తాల్లో స్వల్పంగా భూముల విలువను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. ఈ మేరకు ప్రజల నుంచి అభ్యంతరాలను కోరుతూ ఆయా ప్రాంతా లలోని సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాలలో నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. వెబ్‌సైట్‌లోనూ పెరగనున్న ధరల వివరాలు ఉంచారు. గురువారం లోపు అభ్యంతరాలను సమర్పించాల్సి ఉంది. కొన్నిచోట్ల 10శాతం విలువను పెంచుతూ ముసాయిదాలను తయారు చేశారు. సాధారణంగా రెండేళ్లకు ఒకసారి ప్రభుత్వం భూముల విలువ పెంచుతుంది. అందులో భాగంగా గతేడాది ఫిబ్రవరిలో పట్టణ ప్రాంతాల్లో 15శాతం పెంచారు. ప్రస్తుతం మొత్తమంతా పెంచనున్నారు. ఒంగోలు అర్బన్ అథారిటీ పరిధిలోకి దాదాపుగా ఉమ్మడి జిల్లా అంతా వస్తుంది. ఈ మేరకు జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో భూములు విలువ పెరగనుంది.
పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాలు
ఒంగోలు నగరంలోని భిలాల్‌నగర్‌లో గతంలో చదరపు గజం విలువ రూ.12 వేలు ఉండగా ప్రస్తుతం రూ.14 వేలకు పెరగనుంది.
ట్రంక్‌రోడ్ ప్రాంతంలో గతంలో చదరపు గజం రూ.49 వేలు కాగా ప్రస్తుతం రూ.51 వేలు కానుంది.
భాగ్యనగర్, రామ్‌నగర్ ప్రాంతాలలో గతంలో చదరపు గజం రూ.28 వేలు ఉండగా ఇప్పుడు రూ.30 వేలకు పెరగనుంది.
ముక్తినూతలపాడులో ఇప్పటి వరకూ ఎకరం రూ.42 లక్షలు ఉండగా అది రూ.44 లక్షలకు చేరనుంది.
కొప్పోలులో ఎకరం రూ.26 లక్షల నుంచి రూ.27 లక్షలకు పెరగనుంది
పెళ్లూరులో ప్రస్తుతం ఎకరా రూ.18 లక్షలు ఉండగా రూ.19 లక్షలకు చేరనుంది.
టంగుటూరులో ఎకరా విలువ రూ.13 లక్షల నుంచి రూ.14 లక్షలకు పెరగనుంది.
మద్దిపాడులో ఎకరా ప్రస్తుతం రూ.11 లక్షలు కాగా రూ.11.50 లక్షలు చేరే అవకాశం ఉంది.
కొత్తపట్నం మండలం అల్లూరులో ప్రస్తుతం ఎకరా భూమి విలువ రూ.9.20 లక్షలు ఉంది. అది రూ.9.60 లక్షలకు పెరగనుంది.
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పెరిగిన రద్దీ
వచ్చేనెల నుంచి భూముల విలువ పెరగనుండటంతో రిజిస్ట్రేషన్ చార్జీలు 10శాతం పెరుగుతాయి. దీంతో ఇప్పటివరకు అగ్రిమెంట్లపై ఉన్న ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు క్యూకడుతున్నారు. ఉదాహరణకు ఒంగోలు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మొత్తం 78 స్లాట్లు ఉండగా గతంలో సరాసరి నిత్యం 50 నుంచి 60 స్లాట్లు మాత్రమే బుక్ అయ్యేవి. బుధవారం ఆ సంఖ్య ఏకంగా 75కు చేరింది. అంటే ఒకేరోజు 15 దస్తావేజులు పెరిగాయి. రానున్న మూడు రోజులు ఇదేవిధంగా ఉంటుందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు.